
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొ.నాగేశ్వర్ ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా-పవన్ కళ్యాణ్ భేటీలో ఇదీ మాట్లాడుకున్నారంటూ వైసీపీ పట్ల తన అవ్యాజమైన ప్రేమని, టీడీపి, చంద్రబాబు నాయుడు పట్ల అక్కసుని వెళ్ళగక్కారు.
కానీ ఆ తర్వాత తాను తప్పుడు సమాచారంతో పొరపాటున ఆవిధంగా మాట్లాడానని, కనుక బేషరతుగా ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకుంతున్నానని చెప్పి, క్షమాపణలు కూడా చెప్పుకున్నారు. ఇక్కడితో ఈ వివాదం ముగిద్దామని ఆయనే స్వయంగా విజ్ఞప్తి చేశారు.
డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కూడా ఆయన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందిస్తూ “పెద్దాయన ఏదో పొరపాటున మాట్లాడారు. ఆయనే ఒప్పుకున్నారు. కనుక ఈ కేసులు, అరెస్టులు వద్దని” పోలీసులను వారించారు.
ఈవిధంగా ఇరు పక్షాలు వెనక్కు తగ్గినప్పుడు ఈ వివాదం ఇంత త్వరగా సమసిపోవడం నచ్చని కొందరు “ప్రొ.నాగేశ్వర్‌ని అరెస్ట్ చేసేందుకు ఆంధ్రా పోలీసులు హైదరాబాద్ బయలుదేరారు,” అంటూ పుకార్లు పుట్టించారు.
దీంతో ‘తెలంగాణకు చెందిన జర్నలిస్టు ప్రొ.నాగేశ్వర్‌పై టీడీపి, ఆంధ్రా మీడియా, ఆంధ్రా పోలీసులు దాడి’ అంటూ అక్కడి మీడియాలో కొందరు నిన్న హైదరాబాద్ ప్రెస్‌క్లబ్బులో ప్రెస్‌మీట్ పెట్టి విరుచుకుపడ్డారు.
ఆ సమావేశంలో మాట్లాడిన ఆయన తన వలన జరిగిన ఒక పొరపాటుతో ఈ వివాదం మొదలైందని, తాను క్షమాపణలు చెప్పి దీనిని ముగించాను కనుక ఈ సమావేశం వద్దని వారించి ఉండాలి.
కానీ అయన ఈ సమావేశంలో పాల్గొని “నేను కులం, ప్రాంతం గురించి మాట్లాడలేదు. కేసులు, అరెస్టు, జైలుకి భయపడేవాడినే అయితే ఇంత కాలం మీడియాలో ఉండేవాడినే కాను. నా జీవితంలో అన్నీ చూశాను.. ఒక్క జైలు జీవితం తప్ప. దానికీ నేను సిద్ధం,” అంటూ మాట్లాడారు.
కొందరు తెలంగాణ జర్నలిస్టులు ఆయనకు సంఘీభావం తెలుపుతూ చాలా ఆవేశంగా మాట్లాడారు. వాటిపై ఆంధ్రా వైపు నుంచి ఘాటుగా జవాబులు వచ్చాయి. ఇది ఇలాగే సాగితే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మద్య వివాదంగా మారుతుంది కదా?
ప్రొ.నాగేశ్వర్ గొప్ప మేధావి కనుక లౌక్యంగా మాట్లాడగలరు. అంత పెద్ద మేధావి ఈవిధంగా నోరు జారినప్పుడు టీడీపి, జనసేనల సామాన్య కార్యకర్తలు లేదా వాటి మద్దతుదారులు ఆవేశంగా మాట్లాడటం, కేసులు పెట్టడం కూడా సహజమైన రియాక్షన్‌గానే చూడాలి కదా?
పైగా డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ స్వయంగా ఏపీ పోలీసులని వారించినప్పుడు మళ్ళీ ప్రెస్‌మీట్ పెట్టి ఈవిధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడటంలో అంతర్యం ఏమిటి?
Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…
The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…