
అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంతో మీడియా దృష్టి మంచు మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న గొడవలపై నుంచి మళ్ళడం వారి కుటుంబానికి చాలా ఉపశమనం కలిగించే విషయమే. కానీ అంత మాత్రాన్న మంచులో కొట్లాటలు ఆగలేదని మోహన్ బాబు భార్య నిర్మల తాజా లేఖ స్పష్టం చేసింది.
ఆమె తమ పెద్ద కుమారుడు మంచు విష్ణు ఎటువంటి తప్పు చేయలేదని చిన్న కుమారుడు మంచు మనోజే ఈ గోడవలంతటికీ కారణమని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్‌కు నిన్న ఓ లేఖ వ్రాశారు.
తన పుట్టిన రోజు సందర్భంగా మంచు విష్ణు కేక్ పట్టుకొని జల్పల్లిలో తమ నివాసానికి వచ్చాడని, తనచేత కేక్ కట్ చేయించిన తర్వాత విష్ణు తన గదిలో ఉన్న తన సామాను తీసుకొని వెళ్ళిపోయాడని, కానీ తర్వాత తమ చిన్న కొడుకు మనోజ్ ఇంటికి వచ్చి చాలా గొడవ చేశాడని నిర్మల తన లేఖలో పేర్కొన్నారు.
మంచు మనోజ్ పోలీస్ స్టేషన్‌లో తన తండ్రి మోహన్ బాబుపై పిర్యాదు చేసినందున, ఆ కేసు నుంచి బయట పడేందుకు న్యాయవాదుల సలహా మేరకు ఆమె లేఖ వ్రాసి ఉండొచ్చు. కానీ ఈ ఒక్క లేఖతో మోహన్ బాబు దంపతులు, మనోజ్‌ని మంచు కుటుంబం నుంచి వెలి వేసిన్నట్లే భావించవచ్చు.
కనుక మంచు మనోజ్ కూడా ఇందుకు ప్రతికార చర్య చేపట్టకుండా ఉండరు. మంచు విష్ణు, మనోజ్ ఇద్దరిపై రాచకొండ పోలీసులు ఏడాది పాటు బైండోవర్ చేసినప్పటికీ, న్యాయపోరాటాలకు అదేమీ అవరోదం కాబోదు. కనుక మళ్ళీ మంచులో పోరాటాలు మొదలయ్యే అవకాశం ఉంది.
అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం అంతా ‘వన్-డే 20/20 మ్యాచ్‌లా చకచకా సాగి ముగిసిపోవడంతో మీడియాకు మంచి మసాలా వార్తలు లేకుండా పోయాయి. ఆ కొరతని మంచు కుటుంబమే తీర్చబోతోంది మళ్ళీ.
BRS working president and former Telangana minister K.T. Rama Rao (KTR) has reportedly filed a…
Ask people who directed a hit film most of the people have an answer. Ask…