
ఈ ‘భజన’ను చూస్తూ… వింటూ… పగలబడి నవ్వడం అనేది పవన్ కళ్యాణ్ రొటీన్ గా చేసే విషయమే. అయితే ఆడియో వేడుక జరగడానికి సమయం ఉంది గనుక, ఆ తరహా శ్లోకాలు వినడానికి అభిమానులకు కూడా ఇంకాస్త సమయం ఉంది. కానీ “అజ్ఞాతవాసి” పోస్టర్లు విడుదల అవుతుండడంతో… సోషల్ మీడియాలో తనదైన శైలిలో ‘భజన’ కార్యక్రమం యొక్క రుచి ఫ్యాన్స్ కు చూపిస్తున్నారు.
టీజర్ రిలీజ్ డేట్ ను ధృవీకరిస్తూ విడుదల చేసిన పోస్టర్ పై బండ్ల గణేష్ “అబ్బబ్బబ్బబ్బా…ఏంది స్వామి ఇది అదిరిపోయింది…” ట్వీట్ చేయడంతో తన భజన ప్రస్థానాన్ని ప్రారంభించినట్లయ్యింది. ఇక టీజర్ విడుదల కాబోతున్న 16వ తేదీన ఇది మరొక మెట్టు ఎక్కకుండగా, ఆడియో రిలీజ్ డేట్ గా ప్రచారం జరుగుతున్న 19వ తేదీన ‘భజన’ పీక్స్ కు వెళ్తుందని చెప్పవచ్చు.
అయితే బండ్ల గణేష్ చేసే ప్రకటనలు ఒక్కోసారి మరీ ‘ఓవర్’గా ఉంటాయని సదరు పవర్ స్టార్ ఫ్యాన్సే పెదవి విరుస్తూంటారు. అయినప్పటికీ బండ్ల మాత్రం తాను చేయాలనుకున్నది చేసి గానీ స్టేజ్ దిగరన్న విషయం తెలియనిది కాదు. ఈ సారి చిరంజీవి కూడా ఆడియో వేడుకకు రానున్నారన్న సమాచారంతో ‘స్క్రిప్ట్’ మరింత గట్టిగా సిద్ధం చేసుకుంటారేమో!
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…