
పాలలో కనిపించని వెన్నని చిలికి బయటకు తీసినట్లే, జగన్ హయాంలో వైసీపీ నేతలు ఇసుక, మట్టి దిబ్బలు మొదలు ప్రతీ దానిలో నుంచి ‘వెన్న’ తీసుకున్నారు. అటువంటిదే గ్రూప్-1 పరీక్షా పత్రాల డిజిటల్ మూల్యాంకనం కూడా!
పరీక్షలకు ముందుగా ప్రశ్నాపత్రాలు సంపాదించి అమ్ముకోవడం చూశాము. కానీ పరీక్షలు పూర్తయిన తర్వాత జవాబు పత్రాల మూల్యాంకనంలో కూడా గోల్ మాల్ చేయవచ్చని కొత్త విషయం పీఎస్ఆర్ ఆజనేయులు పై మరో కేసు నమోదు చేయడంతో బయటపడింది.
ఇప్పటికే ముంబయి నటి కాదాంబరి జెట్వానీ కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్‌లో ఉన్న ఆయనపై విజయవాడలో సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఏపీపీఎస్సీ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు.
ఈ పరీక్ష పత్రాలను ఏపీపీఎస్సీ కార్యాలయం, మరో కేంద్రంలో సీసీటీవీ కెమెరాల నిఘాలో మూల్యాంకనం చేసి, 2021, ఏప్రిల్ 28న అర్హత సాధించిన గ్రూప్-1 అభ్యర్థుల జాబితా ప్రకటించింది.
కానీ ఆ తర్వాత ‘కామ్ సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్’ అనే ప్రైవేట్ కంపెనీకి జగన్ ప్రభుత్వం 2022, ఫిబ్రవరి 16న రూ.1.14 కోట్లు చెక్ రూపంలో చెల్లించి, మంగళగిరిలో హాయ్ ల్యాండ్ రిసార్ట్‌లో డిజిటల్ పద్ధతిలో మూల్యాంకనం చేయించారు. కరోనా కారణంగా డిజిటల్ మూల్యాంకనం చేయించాల్సి వచ్చిందని చెప్పుకుంది.
పీఎస్ఆర్ ఆంజనేయులు ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్నప్పుడే ఇదంతా జరిగింది. ఆ తర్వాత 2022, ఫిబ్రవరి 19న గౌతం సవాంగ్ ఏపీపీఎస్సీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే హాయ్ ల్యాండ్ రిసార్ట్ నుంచి వాటిని వెనక్కు రప్పించి వాటికి కొత్తగా ముద్రించిన ఓఎంఆర్ షీట్లు జత చేశారు!
ఈ వ్యవహారం పైపై నుంచి చూస్తేనే ఏదో గోల్ మాల్ జరిగినట్లు అర్థమవుతోంది. కనుక లోతుగా దర్యాప్తు జరిపితే ఇంకెన్ని కొత్త విషయాలు బయటపడతాయో తెలీదు.
కాని ఏపీపీఎస్సీ నుంచి కూడా జగన్ ప్రభుత్వం వెన్న తీసుకోవాలనుకోవడమే దిగ్బ్రాంతికలిగిస్తుంది.
A little over two years after the previous Assembly elections, Andhra Pradesh is preparing for…
Rashmika Mandanna’s absence from the Ranabaali trailer launch became one of the talking points of…