
ఒక్క బెనిఫిట్ షో ఒక కుటుంబానికి జీవిత కాలం విషాదాన్ని మిగిలిస్తే, మరో కుటుంబానికి తన జీవిత కాలం చెరుపుకోలేని ఒక మచ్చను మిగిల్చింది. ఈ సంఘటనలో నేరమెవరిది.? సానుభూతి ఎవరికీ.? శిక్ష అనుభవిస్తుంది ఎవరు.? అంటూ పబ్లిక్ అనేక ప్రశ్నలను సమాజం ముందుకు తీసుకువచ్చింది.
అనుకోని ఘటన అని తప్పించుకునేంతగా చిన్న పొరపాటు కాదు, అలా అని తెలిసి చేసిన నేరము కాదు. కానీ జరిగిన తప్పుకి బాధ్యత వహించాలి. అలాగే చేసిన పనికి పచ్చాత్తాపం అనుభవించాలి. అయితే ఈ దుర్ఘటనలో బాధ పడుతుంది ఒక కుటుంబమైతే సానుభూతి మాత్రం మరో కుటుంబానికి దక్కింది అనే అభిప్రాయం వెలువడుతుంది.
బన్నీ ని ఒక్క రోజు జైలుకు పంపించినందుకు యావత్ సినీ పరిశ్రమ మొత్తం ఆయనకు అండగా నిలుస్తూ అల్లు ఇంటికి వచ్చి మరి ఆయనకు మద్దతు తెలిపారు. అయితే ఇదే సానుభూతి అటు బాధిత కుటుంబం పట్ల కూడా సెలబ్రెటీలు చూపించి ఉంటే ఇప్పుడీ విమర్శలకు జవాబు చెప్పే అవసరం వారికి వచ్చి ఉండేది కాదు.
బన్నీ కి మద్దతుగా నిలిచిన వారిలో ఏ ఒక్కరైనా ఆ సామాన్య కుటుంబానికి బాసటగా నిలిచి ఉంటే వారి స్థాయి, స్థానం రెండు తెలుగు రాష్ట్రాలలో మరో లెవెల్ లో ఉండేది. తమ సినీ కుటుంబానికి చెందిన వ్యక్తికీ చిన్న ఇబ్బంది కలిగితే అందరు ఒక్క తాటి మీదకు రావడం మంచిదే.
కానీ అదే సినీ కుటుంబ సభ్యుడు వల్ల జరిగిన పొరపాటుకు, ప్రాణం విలువకు కూడా సినీ పరిశ్రమ స్పందించి బాధిత కుటుంబానికి తమ సానుభూతి తెలియచేసి ఉంటే బాగుండేది అనే ఆవేదన సర్వత్రా వినపడుతుంది. మొదటి రోజే సినిమా చూడాలి అనే చిన్న ఆశతో ధియేటర్ వద్దకు వచ్చిన ఆ నలుగురు కుటుంబ సభ్యులలో ఇప్పుడు ఒకరు శాశ్వతంగా దూరమయ్యారు. మరొకరు గత కొన్ని రోజులుగా ప్రాణాలు నిలబెట్టుకోవడానికి ఆ దేవునితో పోరాటం చేస్తున్నాడు.
తల్లికి దూరమైన ఆ చిన్నారి చెపుతున్న “మా అమ్మ ఎప్పటికి తిరిగి రాని ఊరు వెళ్ళింది” అనే అమాయకపు మాటలు అందరిని కంటతడి పెట్టిస్తున్నాయి. ఇక నా అన్నతో ఆడుకోవడానికి మరో నెల రోజుల సమయం పడుతుంది అంటూ శ్రీ తేజ్ ఆరోగ్యం మీద ఆ పాపా చేసిన వ్యాఖ్యలు సెలబ్రెటీల సానుభూతి మీద ఎన్నో ప్రశ్నలను లేవనెత్తాయి.
ఒక పక్క భార్యను పోగొట్టుకుని, మరో పక్క కొడుకుని ఆసుపత్రి పాలు చేసుకుని, ఆ పాపను ఒంటరిని చేసి ఆ తండ్రి పడుతున్న మానసిక వేదనకు వెలకట్టగలమా.? ఒక్క ఓదార్పు, ఒక్క చేయూత ఒక మనిషి ఆశకు ఊపిరి పోస్తుంది. ఇప్పుడు శ్రీ తేజ్ కుటుంబానికి కావాల్సిన సానుభూతి, దక్కాల్సిన ఓదార్పు ఎవరికీ దక్కినట్టు.? ఆలోచించండి.
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…