
దాదాపుగా 25 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా స్టిల్స్ ఇటీవలే విడుదలయ్యాయి. అయితే ఆ ఫోటోలలో పూజాకుమార్ లుక్ ను మాత్రం చిత్ర యూనిట్ విడుదల చేయలేదు. కానీ ఈ రోజు ప్రత్యేకంగా పూజతో కూడిన పోస్టర్స్ ను విడుదల చేసారు. ‘స్వాతి’ అనే పాత్రలో పూజ నటిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. అయితే ‘విశ్వరూపం’లో చూసిన పూజకు, ప్రస్తుతం ‘గరుడ’లో చూస్తున్న పూజకు చాలా వ్యత్యాసం ఉండడంతో సినీ ప్రేక్షకులు అవాక్కయ్యారు.
లేలేతగా కమల్ కనిపించిన అదే పూజకుమార్ యేనా? అనిపించేలా ముఖకవళికల్లో భారీ మార్పులు వచ్చాయి. అయినప్పటికీ సహజ అందగత్తే కావడం, దానికి తోడు చీరకట్టులో కనిపించడంతో… పూజ లుక్ ఏమీ తీసేయదగ్గ విధంగా లేదు. ఈ సినిమాలో రాజశేఖర్ కు భార్యగా, ఆరు సంవత్సరాల బాబుకు తల్లిగా హోమ్లీ క్యారెక్టర్ లో కనువిందు చేయనుంది. పూజ నటించే డైరెక్ట్ తెలుగు సినిమా ఇదే కావడంతో, దీంతో విజయం వరిస్తే… టాలీవుడ్ లో చక్రం తిప్పే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి మరి!
Dia Mirza's latest controversy began with a simple appeal for a pollution-free Diwali. But what…
గతంలో బెంగళూర్ ప్యాలస్ లో, హైద్రాబాద్ లోటస్ పాండ్ లో కూర్చుని కూడా పులివెందుల రాజకీయం నడిపించిన జగన్ ఇప్పుడు…