Telugu

పులివెందుల రీసౌండ్ రాష్ట్రమంతా వినిపించిందిగా!

నేడు దీపావళి పండుగకు ఎలాగూ టపాసులతో రాష్ట్రమంతా దద్దరిల్లిపోతుంది. కానీ మంత్రి నారా లోకేష్‌, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కోరుకున్నట్లే పులివెందుల ఫలితాల రీసౌండ్ రాష్ట్రమంతా వినిపించింది.

మున్సిపల్ ఎన్నికలలోనే కూటమి కడప, పులివెందుల కంచుకోటలను బద్దలు కొట్టడంతో అప్రమత్తమైన జగన్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలోనైనా పట్టు నిలుపుకొని పరువు కాపాడుకోవాలనుకున్నారు. అందుకే ఈ ఎన్నికలకు ముందు పులివెందులలో అంత హడావుడి చేశారు.

ADVERTISEMENT

ఇక్కడ గూబ గుయ్య్ మనిపిస్తే ఆ సౌండ్ రాష్ట్రమంతా వినిపించాలని జగన్‌ పులివెందుల ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే మంత్రి నారా లోకేష్‌ కూడా పులివెందులలోనే వైసీపీని ఓడించి ప్రజలు కూటమి ప్రభుత్వంతోనే ఉన్నారని రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇద్దరూ కోరుకున్నది ఒక్కటే కానీ వేర్వేరు ఫలితాలు. ఏది ఏమైనప్పటికీ, జగన్‌ కోరుకున్నట్లుగానే పులివెందుల ఓటర్లు గూబ గుయ్యిమనేలా వైసీపీనే కొట్టారు. ఆ రీసౌండ్ రాష్ట్రమంతా మారుమ్రోగింది. అలాగే వైసీపీ ఆర్తనాదాలు రాష్ట్రమంతా మారుమ్రోగాయి.

నాడు ‘వైనాట్ కుప్పం?’ అని జగన్‌ అన్నారు. కానీ నారా లోకేష్‌ ‘వైనాట్ పులివెందుల?’ అని అనకుండానే చేసి చూపారు.

మొత్తం జడ్పీటీసీ స్థానాలు: 659, కూటమికి అనుకూలంగా ఏకగ్రీవాలు: 77, మిగిలిన 582 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

వాటిలో అత్యధికంగా టీడీపి: 384, జనసేన: 70, బిజేపి: 19, వైసీపీ: 57, ఇతరులు: 4 స్థానాలు గెలుచుకున్నారు. కూటమి మొత్తం 473 స్థానాలు దక్కించుకుంది.

విశేషమేమిటంటే, పులివెందుల కంచుకోటలో జనసేన కంటే వైసీపీకి తక్కువ స్థానాలు రావడం.

ఎంపీటీసీ మొత్తం స్థానాలు: 9,821, ఏకగ్రీవాలు: 2,051, ఎన్నికలు జరిగినవి: 7,767, టీడీపి: 4,754, జనసేన: 945, బిజేపి:120, వైసీపీ: 1,583, ఇతరులు: 187. కూటమి మొత్తం 5,812 స్థానాలు దక్కించుకుంది.

పులివెందుల ప్రజలు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబం దౌర్జన్యాలకు భయపడుతూ ఆ పార్టీ అభ్యర్ధులకు ఓట్లు వేస్తున్నారు. తొలిసారిగా ధైర్యంగా కూటమి పార్టీలకు ఓట్లు వేయడం ద్వారా వారికి రాజకీయ స్వాతంత్ర్యం లభించినట్లే భావించవచ్చు. మరో విశేషమేమిటంటే, తొలిసారిగా పులివెందుల జిల్లా పరిషత్‌పై టీడీపి జండా ఎగురబోతోంది.

కనుక రాష్ట్రమంతా ఒక ఎత్తు అయితే ఒక్క పులివెందులలో కూటమి విజయం, వైసీపీ అపజయం ఒక్కటీ మరో ఎత్తు అని చెప్పవచ్చు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Sarpanch’s Short Ball Weakness: 2027 WC Worry?

Shreyas Iyer's repeated struggles against short-pitched bowling have become a concern for Team India ahead…

33 minutes ago

Pawan’s JanaSena Records 98.2% Strike Rate in Godavari

Pawan Kalyan's JanaSena Party has reported a 98.2 per cent strike rate in the MPTC…

1 hour ago