Telugu

టీడీపీ టపాసులు: పులివెందులలో రీసౌండ్.?

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపాలు వెలిగించి, టపాసులు కాల్చి ప్రజలు దీపావళి పండుగను జరుపుకుంటారు. ఈ దీపాల వెలుగు తమ జీవితాలలోకి రావాలని ఆశిస్తూ చిన్నా, పెద్దా అందరు కూడా దీపావళి పండుగను జరుపుకుంటారు.

అయితే ఏపీలో జరిగిన స్థానిక ఎన్నికలు, ఆ ఎన్నికలకు వచ్చిన ఫలితాలు కూడా కూటమి పార్టీలలో అటువంటి దీపావళి వెలుగులను నింపితే, వైసీపీలో అమావాస్య చీకట్లను మిగిల్చాయి. ముందునుంచీ కూడా గెలుపు పై ధీమాగా ఉన్న కూటమి పార్టీలు ఈ స్థాయి విజయాన్ని మాత్రం ఊహించి ఉండకపోవచ్చు.

ADVERTISEMENT

టీడీపీ, జనసేన మధ్య మొదలైన సీట్ల పంచాయితీ, దానికి ప్రతిగా టీడీపీ వారియర్స్ – జనసైనిక్స్ మధ్య రాచుకున్న సోషల్ మీడియా యుద్ధాలతో ఈ రెండు పార్టీల మధ్య స్థానిక ఎన్నికలు చీలిక తీసుకువస్తాయని తద్వారా వైసీపీ రాజకీయంగా లబ్ది పొందే అవకాశం ఉంటుందని ఆశించిన వైసీపీ శ్రేణులకు కూటమి పార్టీల మద్దతుదారులు ఊహించని షాక్ ఇచ్చారనే చెప్పాలి.

పార్టీల పరంగా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, ఇరు పార్టీల క్యాడర్లో ఆధిపత్య పోరు నడుస్తున్నప్పటికీ అది కేవలం మాటల వరకే, చేతులలోకి వచ్చేసరికి ఇరు పార్టీల క్యాడర్ నుంచి లీడర్ల వరకు తమ ఉమ్మడి రాజకీయ ప్రత్యర్థి ఓటమే తమ ప్రధాన లక్ష్యం అన్నట్టుగా టీడీపీ, జనసేన క్యాడర్ కలిసి క్షేత్ర స్థాయిలో బలంగా పనిచేస్తుంది.

దానితాలూకా ఫలితమే జగన్ సొంత నియోజకవర్గమైన, వైఎస్ కుటుంబ కంచుకోట పులివెందులలో కూడా వైసీపీ ఘోర ఓటమి. కూటమి పార్టీలు ముఖ్యంగా టీడీపీ శ్రేణుల రాజకీయ సంకల్పం ఎంత బలంగా ఉందంటే ఎక్కడో బెంగళూర్ ప్యాలస్ లో కూర్చుని కూడా పులివెందుల రాజకీయాలు నడపగలిగిన జగన్ ను కేవలం స్థానిక ఎన్నికలలో వైసీపీ గెలుపు కోసం పులివెందుల రోడ్ల మీదకు తీసుకొచ్చారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో వై నాట్ కుప్పం అంటూ పట్టుపట్టి, పంతం పట్టి మరి వైసీపీ కుప్పంలో టీడీపీ ఓటమిని బాబుకి గిఫ్ట్ గా ఇచ్చింది. దాని తాలూకా రిటర్న్ గిఫ్ట్ పులివెందులలో వైసీపీ ఘోర ఓటమి, జగన్ పులివెందుల రోడ్ల మీద నిరసన, కనీసం తన సొంత నియోజకవర్గంలో కూడా జగన్ తన ఓటు హక్కు వినియోగించుకోలేని పరిస్థితి అనే రాజకీయ విశ్లేషణలు వెలువడ్డాయి.

అయితే పులివెందులలో వైసీపీ ఓటమిని ముందుగానే అంచనా వేసిన జగన్ తాను ఓటేసినా వైసీపీ ఓటమిని అడ్డుకోలేకపోయారు అనే అప్రదిష్ట నుంచి తప్పించుకునేందుకే జగన్ పులివెందులలో ఓటు వేయకుండా వెనుతిరిగారు అనే అభిప్రాయం వైసీపీ రాజకీయ ప్రత్యర్థుల నుంచి వెలువడుతుంది.

అయితే నాటి సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో 151 నుంచి వైసీపీ 11 కి పడితే ఇప్పుడు జరిగిన స్థానిక ఎన్నికల ఫలితాలతో వైసీపీ పులివెందులలో కూడా పరువు కాపాడుకోలేకపోయింది. దీనితో టీడీపీ వేసిన స్థానిక ఎన్నికలు అనే దీపావళి టపాసులకు వైసీపీకి పులివెందులలో రీసౌండ్ వినిపించినట్లయ్యింది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ranbir’s Shocking Retirement Plan After Ramayana?

Ranbir Kapoor is currently appearing as Lord Ram in Ramayana, and he has already got…

27 minutes ago

Nooru Kodi Vaanavil Review: Outdated, Amateurish Romance

BOTTOM LINE Outdated, Amateurish Romance PLATFORM ZEE5 RUNTIME 2Hours What Is the Show About? Vinoth,…

58 minutes ago