అవినాష్ కొత్త స్టోరీ చెప్పొచ్చుగా… మళ్ళీ అదేనా?

పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలలో వైసీపీ ఓటమిని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోవడం చాలా కష్టమే. జగన్‌, అవినాష్ రెడ్డి అడ్డాలోనే వైసీపీ ఓడిపోవడం వారిద్దరి పరువు పోయింది. కానీ ఎప్పటిలాగే వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మళ్ళీ పాత పాటే పాడారు.

ఈ ఎన్నికలలో టీడీపి అక్రమాలకు పాల్పడి గెలిచింది కనుక అది ఓ గెలుపే కాదన్నారు. పులివెందుల ప్రజలు ఎవరూ ఈ పోలింగ్ ప్రక్రియలో పాల్గొననప్పుడు వీటిని ఎన్నికలని ఎలా అంటారని ప్రశ్నించారు.

ADVERTISEMENT

ఈ ఎన్నికలలో వైసీపీ ఓడిపోయిందని అనిపిస్తున్నప్పటికీ పులివెందుల ప్రజలందరూ మనతోనే ఉన్నారని కనుక వైసీపీ కార్యకర్తలు ఎవరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదన్నారు. మనకి ఒక రోజు వస్తుంది. ఆ రోజు నిజమైన ఓటర్ల ఓట్లతోనే గెలిచి రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వద్దామని అవినాష్ రెడ్డి అన్నారు.

శాసనసభ ఎన్నికలలో వైసీపీ ఓడిపోయినప్పుడు జగన్‌ కూడా ఇలాగే ఈవీఎంల కారణంగా ఓడిపోయామని తమ ఓటమి బాధ్యత నుంచి తప్పించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమీషన్ అన్యాయంగా వ్యవహరిస్తూ చంద్రబాబు నాయుడుకి సహకరించడం వల్లనే ఓడిపోయామని చెప్పుకున్నారు.

ఎన్నికలలో ఓడిపోయినా 40 శాతం ప్రజలు మనవైపే ఉన్నారని కనుక నైతికంగా మనమే గెలిచామని సమర్ధించుకున్నారు. అదే… బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహిస్తే మా తడాఖా చూపిస్తామని నేటికీ జగన్‌ పదేపదే సవాలు చేస్తున్నారు.

ఇప్పుడు అవినాష్ రెడ్డి మాటలు కూడా ఇంచుమించు అలాగే ఉన్నాయి. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలలో బ్యాలెట్ పేపర్లతోనే నిర్వహించినా వైసీపీ ఓడిపోయింది. అదీ… జగన్‌, అవినాష్ రెడ్డిల అడ్డాలో… అదీ… జెడ్పీటీసీ వంటి చిన్న ఉప ఎన్నికలలో! అయినా వచ్చే ఎన్నికలలో మేమే గెలుస్తామని ప్రగల్భాలు పలకడం మానడం లేదు!

గత ఎన్నికలలో వైసీపీకి రాష్ట్రంలో గంపగుత్తగా ఓట్లు సంపాదించేందుకు సంక్షేమ పధకాల పేరుతో 5 ఏళ్ళపాటు ప్రజలకు డబ్బులు పంచుతూనే ఉన్నారు. ఆ నమ్మకంతోనే 175/175 అని ప్రగల్భాలు పలికారు. కానీ 11 సీట్లే వస్తే “నా అక్కలు, చెల్లెమ్మలు, అవ్వలు మాకు ఎందుకు ఓట్లు వేయలేదో?” అని జగన్‌ తిట్టుకున్నారు.

అప్పుడే ఓట్లు వేయని అక్కలు, చెల్లెమ్మలు, అవ్వలు వచ్చే ఎన్నికలలో తమకే ఓట్లు ఎందుకు వేస్తారో? జగన్‌ కూడా చెప్పలేరు. కానీ ‘మళ్ళీ మనమే’ పాట వినసొంపుగా ఉంటుంది కనుక పదేపదే పాడుకుంటున్నారు. జగన్ ఆనందాన్ని కాదనడానికి మనకేం హక్కు ఉంది?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

IShowSpeed For Spirit? Prabhas Film Gets A Crazy Buzz

Prabhas and Sandeep Reddy Vanga’s Spirit has been grabbing attention with its casting updates and…

31 minutes ago

Jogi’s DIL Reaches Governor: Threat To Her Life?

The highly controversial case pertaining to Jogi Rajeev, the son of former cabinet minister Jogi…

1 hour ago