Telugu

నాటి కుప్పం తాలూకా ఫలితమే నేడు పుంగనూరు.?

ఏపీలో టీడీపీ vs వైసీపీ పార్టీల మధ్య స్థానిక పోరు వార్ వన్ సైడ్ అన్నట్టుగా మారుతుంది. నాటి వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న ఆధిపత్య, అణిచివేత ధోరణికి నేడు ఆ పార్టీ నేతలు మూల్యం చెల్లించాల్సి వస్తుంది.

వైసీపీ హయాంలో నాడు జరిగిన స్థానిక ఎన్నికలలో చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పం టార్గెట్ గా వైసీపీ చేసిన రాజకీయం ముఖ్యంగా వైసీపీ కీలక నేతగా చెలామణి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్కుపెట్టిన బాణం నేడు వైసీపీ కి కూడా గాయం చేసింది.

ADVERTISEMENT

పుంగనూరు కేంద్రంగా చేసుకుని పెద్దారెడ్డి సాగించిన హిట్లర్ తరహా రాజకీయం నాడు కుప్పంలో టీడీపీ ని ఓడించగలిగింది. అయితే నాడు దాని తాలూకా విజయ గర్వంతో వైసీపీ తలెగరేసింది, బాబు ని ఓటమి అవమానంతో అవహేళన చేసింది. అలాగే ఒక ప్రతిపక్ష నేతగా పుంగనూరులో బాబు ని కాలు పెట్టకుండా చేసిన వైసీపీ విధ్వంశం నేడు అదే పుంగనూరులో వైసీపీ రాజకీయానికి కాళ్ళు విరిచాయి.

అయితే యాక్షన్ కి రియాక్షన్ తప్పదు అనేలా టీడీపీ దాటికి అదే పుంగనూరులో వైసీపీ స్థానిక ఎన్నికల సమరం నుంచి చేతులెత్తేసి పక్కకు తప్పుకుంది. పెద్దిరెడ్డి వంటి బలమైన రాజకీయ నేతలు ఉన్నప్పటికీ వైసీపీ పార్టీకి ఈ దుస్థితి రావడం ఏంటంటూ వైసీపీ క్యాడర్ మదనపడుతున్నారు.

పుంగనూరు వైసీపీ అభ్యర్థుల నామినేషన్ రోజే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి చేసిన రెచ్చకొట్టే రాజకీయం టీడీపీ, వైసీపీ మధ్య దాడులకు దారి తీసింది. దీనితో నామినేషన్ కార్యక్రమం కాస్త రణరంగంగా మారిపోయింది. పరిస్థితులు తమకు అనుకూలంగా లేవని గ్రహించిన వైసీపీ ఓటమి అవమానం నుంచి తప్పించుకునేందుకు పుంగనూరు స్థానిక ఎన్నికల నుంచి నిష్క్రమించింది.

దీనితో పుంగనూరు పెద్దిరెడ్డి కోటలో టీడీపీ జెండా ఎగిరింది. అయితే ఇదంతా కూడా నాటి వైసీపీ పాలకులు చేసిన పాపానికి ప్రతిఫలమే అంటున్నారు టీడీపీ తమ్ముళ్లు. ఏదిఏమైనా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏకగ్రీవాలకు తావివ్వకూడదు, యుద్ధం చెయ్యాల్సిందే అంటూ పార్టీ ఇంచార్జ్ నేతలకు ఇచ్చిన ఆదేశాలు క్షేత్ర స్థాయిలో వర్క్ అవుట్ అయ్యే పరిస్థితులు అస్సలు కనిపించకపోవడం వైసీపీ నాయకులకు పెద్ద తాలనోప్పిగా మారింది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Rajini Mark Frames: Chiranjeevi Is Next?

One of the main assets of commercial cinema is elite cinematography. This is a craft…

20 minutes ago

టీడీపీ – జనసేన బంధానికి, ఐక్యతకు విజయవాడ ఆదర్శం

కూటమి పొత్తులో భాగమైన టీడీపీ , జనసేన పార్టీల మధ్య ఏర్పడిన రాజకీయ బంధం ఎన్నికలు వచ్చేసరికి సోషల్ మీడియాలో…

38 minutes ago