
ప్రస్తుతం సరైన సక్సెస్ లేక సునీల్ కూడా తీవ్ర నిరాశలో ఉన్న విషయం తెలిసిందే. కామెడీ నుండి యాక్షన్ వరకు చాలా ప్రయత్నాలు చేసిన సునీల్, నిదానంగా ప్రేక్షకుల అభిరుచికి దూరమవుతున్నారు. దీంతో పూరీ ఆఫర్ వచ్చిన వెంటనే సునీల్ చాలా సంతోషం వ్యక్తం చేసారని ఇన్ సైడ్ టాక్. అయితే వీరిద్దరూ కలిసి ఎలంటి సినిమా తీస్తారనేది మాత్రం ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
లవ్ అండ్ యాక్షన్ సినిమాలు తప్ప కామెడీ సినిమాలు పూరీ వల్ల కాని పని. ఒకప్పుడు ఏదైతే అలీ కామెడీ ట్రాక్స్ తో మంచి పేరు తెచ్చుకున్నాడో, ప్రస్తుతం అదే అలీ ట్రాక్స్ తో ప్రేక్షకులకు ఓ చిన్నపాటి ‘జండుబామ్’ కొనుగోలు చేసే అవకాశాన్నే ఇస్తున్నారు. మరో పక్కన సునీల్ ను కామెడీ సినిమాలలోనే చూడాలన్నది ప్రేక్షకుల అభిలాష. దీంతో ఈ ‘యాక్షన్ + కామెడీ’ ఏ విధంగా వర్కౌట్ అవుతుందోనని సినీ జనాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు.
Reports about Prabhas reuniting with Darling director Karunakaran may turn out to be false. Initial…
A shocking incident at a government school in Raptadu has triggered widespread outrage. A Class…