
ఆధారాలు లేని విషయాన్నీ పట్టుకుని దశాబ్ద కాలం నుండి పవన్ చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకున్నాడు, పవన్ ఒక ప్యాకేజీ స్టార్ అంటూ వాదిస్తున్న రోజా ఇప్పుడు తన పై తన కుటుంబం పై వచ్చిన ఆరోపణల పై ఏం సమాధానము చెప్తారు అంటూ నిలదీస్తున్నారు జనసైనికులు.
విషయానికి వస్తే..,మంత్రి రోజా, ఆమె సోదరుడు కుమారస్వామి రెడ్డి పై సొంత పార్టీ కౌన్సిలర్ తీవ్ర ఆరోపణలు చేసారు. పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పిస్తానంటూ కుమారస్వామి తమ వద్ద నుండి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసారంటూ వైసీపీ పుత్తూరు 17 వ వార్డు కౌన్సిలర్ భువనేశ్వరి మీడియా ముందుకు వచ్చింది.
రిజర్వేషన్ కేటగిరిలో ఉన్న చైర్మన్ పదవి కోసం రోజా అన్నయ్య దళిత మహిళగా ఉన్న నన్ను 70 లక్షల రూపాయిలు డిమాండ్ చేసారని, మూడు విడుతలలో కుమారస్వామికి 40 లక్షలు చెల్లించానని ఇప్పుడు చైర్మన్ పదవి ఇవ్వకపోగా, ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి ఇవ్వడం లేదని రోజా కుటుంబం పై ఆరోపణలు చేసారు భువనేశ్వరి.
రోజా అన్నయ్యను కలవండి అని చెపితేనే మేము కుమారస్వామి దగ్గరకు వెళ్లామని ఇప్పుడు ఆయన డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని మంత్రిగారికి చెప్పినా తమ సమస్యకు పరిష్కారం దొరకపోగా, ఆమె దీని పై మోనంగా ఉండిపోయారంటూ తమకు ముఖ్యమంత్రి జగనన్నే న్యాయం చేయాలంటూ మీడియా సాక్షిగా వేడుకుంటుంది.
అనంతబాబు చేతిలో చనిపోయిన దళిత వ్యక్తి కుటుంబానికి ఏం న్యాయం చేసారో ఇప్పుడు మీ కుటుంబానికి కూడా అదే న్యాయం చేస్తారు ముఖ్యమంత్రి జగన్, వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న సామజిక సాధికారత అంటే ఇదేనా..? అంటూ వైసీపీ ప్రభుత్వం పై మండిపడుతున్నారు విపక్షసభ్యులు.
ఎటువంటి సాక్ష్యాలు చూపకుండానే పవన్ పై ప్యాకేజీ స్టార్ అంటూ ఆరోపణలు చేస్తున్న రోజా ఇప్పుడు మీడియా సాక్షిగా రోజా పై బాధితులు చేస్తున్నఈ వసూళ్ల ఆరోపణలను ఎలా సమర్ధించుకుంటారో..?ఇది కూడా ప్రతిపక్షాల కుట్రగా అభివర్ణిస్తారా.?లేక సొంత పార్టీలోనే రోజాకు అసమ్మతి ఉందని ఒప్పుకుంటారా..? అనేది చూడాలి.
Thalapathy Vijay is one of the biggest names associated with Tamil cinema, and he has…
Vaibhav Sooryavanshi was once again left out of India's playing XI for the fourth T20I…