Telugu

పవన్ కళ్యాణ్ డప్పు తరువాతా ముందు మీ డప్పు మీరు కొట్టుకోండి మాణిక్యాలరావు గారు

సహజం రాజకీయాల్లో ఒక పార్టీ ఎంత బలహీనంగా ఉన్నా తాము బలంగానే ఉన్నామని ప్రజలు తమ వైపే ఉన్నారని రాజకీయ నాయకులు చెప్పుకోవడం మనం చూస్తూ ఉంటాం. అది సహజం కూడా. అయితే ఏపీ బీజేపీ నేతలు మాత్రం దేశవిరుద్ధం. 80 మంది కాపులు పవన్ కల్యాణ్ వైపే ఉన్నారని, కాపులను పవన్ ఎలా వినియోగించుకుంటారో చూడాలని రాష్ట్ర మాజీ మంత్రి మాణిక్యాలరావు పేర్కొన్నారు.

ADVERTISEMENT

రాష్ట్రంలో తాము బలీయమైన శక్తిగా ఎదుగుతామని, వచ్చే ఎన్నికలలో తామే కింగ్ మేకర్లమని చెప్పుకునే బీజేపీ నేతల మాటలకు దీనికీ ఏమైనా సంబంధం ఉందా? రాష్ట్రంలోని ఒక ప్రధాన కులం మద్దత్తు తమకు లేదని ఆయన చెప్పకనే చెప్పారుగా. ఇక ఏ రకంగా బీజేపీ రాష్ట్రంలో ఎదుగుతుందని వారు భావిస్తున్నారో.

బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ కొన్ని బృందాలను కర్ణాటకకు పంపిందని, అయినప్పటికీ కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ఆయన అన్నారు. పక్క రాష్ట్రాలలో బీజేపీ గెలుపు గురించి మాట్లాడటం, వాటి గురించి సంబరాలు చేసుకోవడంతోనే సరిపెడుతున్నారు ఆ పార్టీ నేతలు

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Pics: Mrunal Thakur Turns Ethnic Elegance Into Pure Fire

Mrunal Thakur knows how to make tradition feel effortlessly current. Dressed in an olive-green drape…

24 minutes ago

Virat Kohli in SC Plan: Cracker Free Diwali?

The Supreme Court has suggested involving Indian cricketer Virat Kohli in a public awareness campaign…

54 minutes ago