జగన్ కు అంత సీన్ ఉంటే పక్క రాష్ట్రంలోనే చూపించేవారు కదా!

వైసీపీ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ జగన్ దేశం మెచ్చే నిర్ణయాలను అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. జగన్ చేపట్టిన కులగణన కార్యక్రమం ఎంతో గొప్పదని, వైసీపీ ప్రభుత్వం విద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిందని ఈ నిర్ణయాలను దేశంలో ఎక్కడికెళ్లినా మెచ్చుకుంటున్నారని చెప్పుకొచ్చారు.

గుడిసెల్లో ఉండేవారు డాక్టర్లు ఇంజనీర్లు అవుతున్నారని, అలాగే సామజిక న్యాయంలో దేశానికి జగనే ఆదర్శం అంటూ తన స్వామి భక్తి చాటుకున్నారు ఆర్. కృష్ణయ్య.ఆర్ కృష్ణయ్య చెప్పిన రీల్ కు అసలు రాష్ట్రంలో జరుగుతున్న రియాలిటీకి మధ్య వ్యత్యాసం అంశాల వారీగా ఇప్పుడు చర్చించుకుందాం.రాష్ట్రంలో కుల రాజకీయాలు చేయడమం, కులం పేరు చెప్పి రాజధానిని కూల్చడమేనా జగన్ తీసుకున్న ఆదర్శమైన నిర్ణయం?

ADVERTISEMENT

విద్యా రంగంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక మార్పులు ఏమిటో కూడా కృష్ణయ్య గారు చెపితే బాగుండేది. ప్రభుత్వ పాఠశాలలో చదుకునే పేద విద్యార్థులు ఇప్పుడు తమ చదువు ఇంగ్లీష్ మీడియామా..,లేక తెలుగు మీడియామా అనేది తెలుసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉంచడమేనా? సంవత్సరానికో సిలబస్ మారుస్తూ ఒక సారి సిబిఎస్సీ అని లేదు లేదు ఎన్సియార్టీ అంటూ, ఒక సారి బైజూస్ మరోసారి టోఫెల్ అంటూ ప్రజలకు జగన్ కుచ్చి టోపీ పెట్టి వేల కోట్లు ప్రైవేటు కంపెనీలకు దారాదత్తం చేస్తూ అందులో వాటాలు తీసుకోవడమేనా విప్లవాత్మక నిర్ణయాలు?

అలాగే ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీల ఆస్తులను స్వాధీనపరుచుకోవడానికి విద్యార్థుల జీవితాలను నడి రోడ్డుకి లాగడమేనా ఆదర్శమం? గుడిసెల మధ్యకు వచ్చి తానూ పాలస్ నిర్మించుకుని ఇప్పుడు ఆ పాలస్ కు గుడిసెలు అడ్డుగా ఉన్నాయంటూ తాడేపల్లి జగన్ నివాస ప్రాంతంలో గుడిసెలలో నివాసముంటున్న ఉన్నపేద బీసీ, ఎస్సి, ఎస్టీ ప్రజలను రాత్రికి రాత్రి బెదిరించి కాళీ చేపించించడమేనా దేశం మెచ్చిన నిర్ణయం?

జగన్ దేశం మెచ్చిన నాయకుడు అయితే పక్క రాష్ట్రమైన తెలంగాణ ఎన్నికలలో పార్టీ జెండా ఎందుకు పీకేశాడో? పార్టీని నమ్మిన నాయకులను, నమ్మి ఓటేసిన ప్రజలను గాలికేందుకు వదిలేసాడో? కూడా కృష్ణయ్య గారు సెలవిస్తే బాగుండేది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

ఇండి కూటమి ‘యాంటీ’ ఇండియా రాజకీయం చేస్తుందా.?

గత కొన్ని రోజులుగా బీజేపీ టార్గెట్ గా ముఖ్యంగా మోడీ కార్నర్ గా ఢిల్లీ వేదికగా జరుగుతున్న కాక్రోచ్ల రాజకీయం,…

25 minutes ago

Amaravati Railway Line Likely by 2028-29, Tenders Progress

Amaravati could get railway connectivity by late 2028 or early 2029 through a 57-km railway…

25 minutes ago