
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ధోనీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో ఆ జట్టుకు లక్ష్మి రాయ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది. సరిగ్గా ఇదే విషయం ఇప్పుడు ఊహాగానాలకు కారణమైంది. ధోనీ మాజీ గర్ల్ ఫ్రెండ్ ప్రియాంక గురించి సినిమా ట్రైలర్ లో ప్రస్తావించడంతో రాయ్ లక్ష్మి పాత్ర కూడా ఉండే ఉంటుందని చెబుతున్నారు. ఈ ఊహాగానాలపై స్పందించిన రాయ్ లక్ష్మి మాట్లాడుతూ గతాన్ని గుర్తు చేయడం సబబు కాదంటూ పేర్కొంది.
‘మా ఇద్దరి రిలేషన్ వయసు ఒక ఏడాది కంటే తక్కువే. ఇద్దరి అభిప్రాయాలు కలవకపోవడంతో విడిపోయాం. ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు ముగిసిన అధ్యాయం. ఇప్పుడైతే అతడితో టచ్‌లో లేను.’ అని చెప్పడం వరకు బాగానే ఉంది గానీ, ఆ తర్వాత రాయ్ లక్ష్మి చేసిన వ్యాఖ్యలు సంచలనానికి దారి తీసాయి. ‘నాతో విడిపోయిన తర్వాత ధోనీ ఎందరితోనో డేటింగ్ చేశాడు. ఆ జాబితా చాలా పెద్దది’ అంటూ సరికొత్త చర్చకు తెరలేపింది.
అయినా జీవిత కథ అంటే ఒక్క అమ్మాయిలే కాదు… ధోనీ జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను చూపిస్తారని అనుకుంటున్నా. ఆ సినిమాలో నా ప్రస్తావన ఉండదనే అనుకుంటున్నా. నా నుంచి ఆ విషయాన్ని తెలుసుకోవాలని చాలామంది ప్రయత్నించారు. ఇక నుంచి ఎవరైనా నన్ను ధోనీ గురించి అడిగితే క్రికెటర్ గానే తెలుసు. వ్యక్తిగతంగా పరిచయం లేదు అని చెబుతా… అంటూ కాస్త విసుగ్గానే వివరించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ “జూలీ 2” అనే హాట్ చిత్రంలో నటించింది.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…