
ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో సినిమాలు కూడా తమవంతు పాత్ర పోషించబోతున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేకపోలేదు. ఇప్పటికే వైసీపీ కి మద్దతుగా వ్యూహం, యాత్ర సినిమాలను సిద్ధం చేసారు ఆర్జీవీ మరియు మహి వి రాఘవ. అయితే అనూహ్యంగా వైసీపీ కి కౌంటర్ గా రాజధాని ఫైల్స్ మూవీ తెర మీదకు వచ్చింది.
భాను శంకర్ దర్శకత్వంలో ఆ రాజధాని ఫైల్స్ సినిమా తెరకెక్కింది. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత రాజధాని ప్రాంతంలో జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రం రూపొందినట్టుగా ఉంది. అయితే ఇక్కడ అమరావతి పేరుని అయిరావతిగా, ఆంధ్రప్రదేశ్ పేరుని అరుణప్రదేశ్ గా మార్పు చేసి న్యాయపరమైన అడ్డంకులకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా జాగ్రత పడ్డారు చిత్ర యూనిట్.
అయితే సీనియర్ యాక్టర్స్ వినోద్ కుమార్, వాణి విశ్వనాధ్ లతో పాటుగా నూతన నటీనటులను పరిచయం చేసారు. అయితే ఫిబ్రవరి 9 న విడలవుతున్న యాత్ర తో రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రి గా మరో ఛాన్స్ తీసుకోవాలనుకుంటే ఫిబ్రవరీ 15 న విడుదలకు సిద్దమైన ఈ రాజధాని ఫైల్స్ వైసీపీ ప్రభుత్వానికి మరో ఛాన్స్ రాకుండా అడ్డుపడే అవకాశం ఉంది.
“న్యాయస్థానం టూ దేవస్థానం” అంటూ అమరావతి నుండి తిరుమల వరకు రాజధాని ప్రాంత ప్రజలు చేసిన మహాపాదయాత్ర ఈ సినిమాలో పొందుపరచడం జరిగింది. అలాగే అమరావతిలో పరదాలు చాటున ముఖ్యమంత్రి చేసిన పర్యటనలు, రాజధాని ప్రాంత ప్రజల పై ప్రభుత్వం అనుసరించిన తీరు అంతా ఈ సినిమాలో తెరకెక్కించినట్లుగా ఉంది.
వైసీపీ అధికారిక భాష నుంచి గుడివాడ క్యాసినో వరకు ట్రైలర్ మొత్తం వైసీపీ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విధానాలను ఎండగట్టేలా, రాబీయే ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా కనపడుతుంది. జగన్ పాదయాత్రను రైతుల మహాపాదయాత్ర అడ్డుకోగలదా.?లేదా అన్నది చూడాలి మరి.
The Department of Homeland Security (DHS) had proposed to end a major H-1B extension rule.…
Generally, when too big films are arriving at the ticket counter correspondingly, there is a…