
కోలీవుడ్ సినీ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ తన రాజకీయ ప్రవేశంపై స్వయంగా సృష్టించిన సస్పెన్స్‌కు ఆయనే స్వయంగా తెరదించారు.
తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో సీఎం విజయ్ పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ రెండు స్థానాల నుంచి పోటీ చేసి గెలిచారు. వాటిలో తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేశారు.
కనుక అక్కడి నుంచి తాను పోటీ చేయాలనుకుంటున్నట్లు రాఘవ లారెన్స్ సంకేతాలు ఇచ్చారు. కానీ నేడు హటాత్తుగా యూటర్న్ తీసుకుంటూ, ఉప ఎన్నికలలో నేను పోటీ చేయడం లేదని ప్రకటించారు.
ఈ మేరకు ఓ వీడియో సందేశం విడుదల చేశారు. దానిలో మరో రెండు విషయాలు స్పష్టం చేశారు. తాను భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తానని, కుదిరితే సీఎం విజయ్ నాయకత్వంలో టీవీకే పార్టీలో చేరి సామాన్య కార్యకర్తగా పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నానని రాఘవ లారెన్స్ చెప్పారు.
కనుక సిఎం విజయ్ సూచన మేరకు రాఘవ ఇప్పుడు పోటీ నుంచి తప్పుకొని ఉండవచ్చు. భవిష్యత్‌లో టీవీకే పార్టీలో చేరడం కూడా ఖాయంగానే కనిపిస్తోంది.
ప్రభుత్వ ఏర్పాటు సమయంలో గందరగోళం ఏర్పడినప్పుడు కోలీవుడ్‌లో పలువురు సిఎం విజయ్‌కి మద్దతుగా మాట్లాడారు. కనుక విజయ్ గేట్లు తెరిస్తే కోలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు టీవీకే పార్టీలో చేరవచ్చు. అలా చేరే వారిలో రాఘవ లారెన్స్ మొట్ట మొదటి వ్యక్తి కావచ్చు.
ప్రస్తుతం విజయ్ ప్రభుత్వానికి డోకా లేనప్పటికీ కోలీవుడ్ నుంచి కొందరు ప్రముఖులను టీవీకే పార్టీలో చేర్చుకోవడం మంచిదే. వారి అండదండలు, పాపులారిటీ విజయ్ ప్రభుత్వానికి ఎంతో కొంత ఉపయోగపడతాయి.
Do your duty. Don’t expect anything in return.
As announced earlier, here is my clarification regarding the Trichy election and my recent press meet.
Thank you all for your love and support #serviceisgod pic.twitter.com/JlIlkxVKdr
— Raghava Lawrence (@offl_Lawrence) June 30, 2026
Kangan Baruah brings a flash of metallic glamour to this striking portrait series. Her silver…
The makers of the 2018 youth entertainer ‘Husharu’ have officially announced its sequel, ‘Husharu 2’.…