Telugu

రఘురామ ర్యాగింగ్ మామూలుగా లేదుగా!

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీ ప్రభుత్వం మద్య గత ఏడాదిన్నరగా టామ్ అండ్ జెర్రీ షో నడుస్తూనే ఉంది. ఇందులో టామ్ (పిల్లి) వైసీపీ ప్రభుత్వం కాగా, జెర్రీ (ఎలుక) రఘురామకృష్ణరాజు అని భావించవచ్చు. జెర్రీని ఏదోవిదంగా పట్టుకొని బందించాలని టామ్ గత ఏడాదిన్నరగా ప్రయత్నిస్తూనే ఉంది. ఓసారి ఏపీ సీఐడీ పోలీసులు ఎలాగో జెర్రీని దొరకపుచ్చుకొని ఎంపీ అని కూడా చూడకుండా పాదాలు వాచిపోయేలా కంకుదెబ్బలు కొట్టారు. కానీ ఆయన గోడుని కేంద్ర ప్రభుత్వం, లోక్‌బహిరంగసభలో స్పీకర్ కూడా పట్టించుకోకపోవడం విశేషం.

అప్పటి నుంచి టామ్‌కి అందనంత దూరంలో అంటే… ఢిల్లీలో ఉంటూ జెర్రీ ఈ షోని రక్తి కట్టిస్తూనే ఉన్నారు. అయితే నిన్న దీపావళి సందర్భంగా హైదరాబాద్‌లో తన కుటుంబ సభ్యులను కలిసేందుకు వచ్చినప్పుడు తనను అరెస్ట్ చేయడానికి అక్కడ ఏపీ సీఐడీ పోలీసులు ఎదురుచూస్తున్నారని ఉప్పందడంతో వెనక్కు తిరిగివెళ్ళిపోవలసి వచ్చిందని, ఓ ఎంపీనైన తనను తన రాష్ట్రంలో, అడుగుపెట్టనీయకుండా చేస్తున్నారని రఘురామ ఆవేదన వ్యక్తం చేశారు. బహుశః ఆ ఆవేదనే ఆవేశంగా మారిందేమో, సిఎం జగన్మోహన్ రెడ్డి మీద తన అక్కసుని వ్యంగ్యంగా ఈవిదంగా వెళ్ళగక్కారు.

ADVERTISEMENT

· అధికారంలోకి వచ్చిన వారం రోజులలోపే సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి మూడున్నరేళ్ళయినా రద్దు చేయని అతని కన్నా మాట తప్పని యోధుడు ఎవరు?

· మద్యం కాపురాలలో చిచ్చుపెడుతోంది గాబట్టి సంపూర్ణ మద్యనిషేధం విధిస్తానని చెప్పి మడమ తిప్పిన అతని కంటే గొప్ప వ్యక్తి ఎవరు?

· ప్రత్యేక హోదా వస్తే ఆదాయపన్ను చెల్లించక్కరలేదని చెప్పిన అతనికంటే గొప్ప ఆర్ధికవేత్త ఎవరు?

· 25 ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచేసి ప్రత్యేకహోదా పట్టుకొచ్చేస్తానని చెప్పిన అతనికంటే గొప్ప పోరాటయోధుడు ఎవరు?

· కేంద్రం నిధులు ఇవ్వకపోతే ఏం?రాష్ట్ర నిధులతో పోలవరం కట్టుకోలేమా? అని అడిగిన అతనికంటే గొప్ప ఇంజనీరు ఎవరు?

· అక్రమ కట్టడం పేరిట ప్రజావేదికను కూల్చివేసిన అతని కంటే గొప్ప ఆర్కిటెక్ట్ ఎవరు?

· బ్యారికేడ్లు, పరదాలు, పోలీసుల రక్షణ మద్య ప్రజలను కలిసే అథై కేటీఆర్‌ గొప్ప వీరుడు ఎవరు?

· రావాలి జగన్… కావాలి జగన్ అని పాడినవారి చేతే ‘ఒక్క ఛాన్స్ చాలు మహాప్రభో’ అనిపించిన అతని కంటే గొప్ప మ్యూజిషియన్ ఎవరు?

· కాస్కో… కిస్కిస్కో వంటి కొత్త పదాలను కనిపెట్టిన అతనికంటే గొప్ప గురువు ఎవరు?

· పచ్చటి రుషికొండకు గుండుకొట్టించేసిన అతని కంటే గొప్ప పర్యావరణ ప్రేమికుడు ఎవరు?

· ఏకంగా 50 మంది సలహాదారులతో పరిపాలన సాగించే అతని కంటే గొప్ప అడ్మినిస్టేటర్ ఎవరున్నారు?

· మూడేళ్ళలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేయగలిగిన అతనికంటే గొప్ప ఆర్ధిక నిపుణుడు ఎవరున్నారు? అంటూ రఘురామకృష్ణ రాజు తన ప్రియాతి ప్రియమైన శత్రువు జగన్మోహన్ రెడ్డిపై వ్యంగ్యంగా ఎద్దేవా చేశారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Vijayawada Mayor Race: Is Chandrababu Behind ABV?

Former MP Vijayasai Reddy has launched a sharp attack on the TDP-led alliance and YSRCP…

26 minutes ago

AP Local Polls: YSRCP’s Loss, Congress’s Gain

Andhra Pradesh needs a strong opposition to question the TDP-led government and hold it accountable.…

46 minutes ago