
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామా కృష్ణరాజు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయితీ రాజ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ శాఖ వంటి ఐదు శాఖల మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ హోమ్ మంత్రి అయితే తాను ఒక కంప్లైంట్ ఇస్తానంటూ వ్యాఖ్యానించారు RRR.
జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ్ శ్రావణ్ తన నాలుక కోసి పవన్ కళ్యాణ్ కు బహుమతిగా ఇస్తానంటూ వ్యాఖ్యానించడం పై తానూ ప్రస్తుతం పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం లేదని, ఒకవేళ గతంలో అన్నట్టుగా పవన్ తానూ హోమ్ శాఖ తీసుకుంటే అప్పుడెళ్ళి తానూ జడ్ శ్రావణ్ మీద కంప్లైంట్ చేస్తాననడంతో ఇప్పుడీ వ్యాఖ్యలు ఏపీలో హాట్ టాపిక్ అయ్యాయి.
అయితే గతంలో తన పై జరిగిన కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ కుమార్ మీద యాక్షన్ తీసుకోవాలని రెండేళ్ల నుంచి పోరాడుతుంటే ఇప్పటికి ఆ విషయంలో తనకు న్యాయం జరగలేదు కాబట్టి పవన్ హోమ్ మంత్రి అయితే తనకు న్యాయం జరుగుతుందేమో అని భావిస్తున్నాన్నారు.
గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ ను హోమ్ మినిష్టర్ చేస్తారనే నమ్మకంతోనే ఇలా మాట్లాడుతున్నా అని, ఒక వేళ అదిజరగని పక్షంలో నా నాలుకను జడ్ శ్రావణ్ నుంచి ఎలా జాగ్రత్తగా రక్షించుకోవాలో ఆలోచిస్తాన్నారు RRR. అయితే RRR తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలతో కూటమిలో టీడీపీ, జనసేన ఇరు పార్టీల మధ్య మరోసారి పదవుల పంచాయితీ ల చర్చ మొదలవుతుందా.?
RRR వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని వైసీపీ, టీడీపీ – జనసేన ల మధ్య రాజకీయ చిచ్చు రాచేస్తుందా.? ప్రత్యర్థి పార్టీకి అస్త్రాలు ఇచ్చే ఇటువంటి వ్యాఖ్యలు అటు పవన్ కానీ ఇటు రఘురామా కానీ బహిరంగంగా ప్రకటించడం ఆమోదయోగ్యమేనా.?
హోమ్ మంత్రి మార్పు అనే విధంగా సీఎం బాబు నుంచి ఎటువంటి సంకేతాలు లేనప్పుడు RRR పవన్ హోమ్ మంత్రి అయితే అని, ముఖ్యమంత్రి బాబు పవన్ ను హోమ్ మినిస్టర్ చేస్తారు అని ప్రచారం చెయ్యడం ద్వారా కూటమికి జరిగే రాజకీయ మేలేంటి.?
ఇప్పటికే వైసీపీ హోమ్ మంత్రి వంగలపూడి అనిత టార్గెట్ గా రాజకీయం మొదలుపెట్టింది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదంటూ అనిత టార్గెట్ గా విమర్శలు ఎక్కుపెడుతుంది. అటువంటి సందర్భంలో ఇప్పుడు కూటమి నేతలే, అందునా టీడీపీ నాయకుడే ఇలా అనిత నాయకత్వంలో తనకు న్యాయం జరగలేదని వ్యాఖ్యానిస్తుంటే ఇక వైసీపీ చూస్తూ కూర్చుకుంటుందా.?
ఒకేవేళ RRR ఉహించినట్టే హోమ్ శాఖ పవన్ చేతికొస్తే అప్పుడు ఇదే వైసీపీ ఒక దళిత మహిళా నేతకు కూటమి ప్రభుత్వంలో అన్యాయం, అనిత ను నమ్మించి మోసం చేసిన బాబు, లోకేష్, పవన్ చేతిలో టీడీపీ కీలుబొమ్మ అంటూ మాట మార్చి మడం తిప్పి మళ్ళీ కొత్త రాజకీయంతో ముందుకొస్తుంది.
దళిత నేత అనే కులం కార్డు తో గౌరవ బాధ్యతాయుత పదవులలో ఉన్న నేతలను సైతం జడ్ శ్రావణ్ వంటి వారు నాలుకలు కోస్తాం అంటూ వ్యాఖ్యానించడం, దళిత సభా వేదికల పేరుతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని అందులో ఉప ముఖ్యమంత్రి పై బూతులతో విరుచుకుపడడం,
ఇక ఆ తరువాత వారి పై కేసులు పెడితే ప్రభుత్వం కక్ష్య సాధింపు రాజకీయాలు చేస్తుంది అంటూ హంగామా చేయడం, మళ్ళీ అదే దళిత కార్డు బయటకు తీసి కుల రాజకీయాలు చేయడం ఏపీలో కొన్ని పార్టీలకు అలవాటుగా మారిపోయింది. పవన్ అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కులం పరిధి దాటి ముందుకెళ్తే తప్ప ఏపీ అభివృద్ధి సాధ్యం కాదా.?
“#PawanKalyan హోంమంత్రి అవుతారు!”
“చంద్రబాబు ఆయన్నే #HomeMinister ని చేస్తారన్న నమ్మకం ఉంది.”
–@KRaghuRaju @PawanKalyan pic.twitter.com/VwEokswPkJ
— M9 NEWS (@M9News_) June 29, 2026
Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…
The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…