
భారత్ జోడో యాత్రలో భాగంగా అస్సాంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ని దేవాలయానికి వెళ్లకుండా అడ్డుకున్నారు పోలీసులు, ఆలయ కమిటీ సభ్యులు. అస్సాంలోని బటద్రవ ఆలయాన్ని దర్శించడానికి వెళ్లిన రాహుల్ ను ఆలయంలోకి మీకు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు.
దీనితో ఆలయంలోకి అనుమతించక పోవడానికి తానూ చేసిన తప్పేంటో చెప్పాలని రోడ్డు మీదే బైఠాయించి నిరసనకు దిగారు రాహుల్ మరియు కాంగ్రెస్ నేతలు. ముందస్తు అనుమతి తీసుకున్నప్పటికీ తన పై ఇలా వ్యవహరించడం, అడ్డుకోవడం సమంజసం కాదంటూ వారించారు రాహుల్.
ఎవరు ఆలయంలోకి వెళ్లి దర్శనం చేసుకోవాలో, ఏ సమయంలో ఆలయంలోకి వెళ్లాలో కూడా కొందరు పెద్దలు నిర్ణయిస్తున్నారు. వాటిని వీరంతా పాటిస్తున్నారు అంటూ ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి విమర్శలు చేసారు రాహుల్. ఇటువంటి నియంతృత్వ పాలనకు రోజులు దగ్గర పడ్డాయి అంటూ తమ నిరసనను కొనసాగించారు కాంగ్రెస్ నేతలు.
మధ్యాహ్నం మూడు తరువాత ఆలయంలోకి అనుమతిస్తాం అంటూ అధికారులు చెప్పడం పై కూడా రాహుల్ అభ్యంతరం వ్యక్తం చేసారు. మాకు నచ్చినప్పుడు దైవదర్శనం చేసుకోవాలా..? లేక మీరు అనుమతిచ్చినప్పుడు మాత్రమే ఆలయాలకు రావాలా..? అంటూ ఆలయ కమిటీ సభ్యులతో వాగ్వాదానికి దిగిన రాహుల్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఒకపక్క అయోధ్యలో బాల రాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంటే ప్రజలంతా దేవాలయాలకు తరలివెళుతుంటే… మరోపక్క ఆలయంలోకి అనుమతి లేదంటూ రాహుల్ గాంధీ దైవదర్శనాన్ని అడ్డుకున్నారు మరికొందరు. ఇదంతా గమనిస్తున్న సోషల్ మీడియా వాదులు దేవునితో రాజకీయాలు తగవు అంటూ ఇరు వర్గాల వారికీ హితవు పలుకుతున్నారు.
Thalapathy Vijay is one of the biggest names associated with Tamil cinema, and he has…
Vaibhav Sooryavanshi was once again left out of India's playing XI for the fourth T20I…