
కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉత్తరాది రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఎంతగా ప్రయత్నించినప్పటికీ కోలుకోలేకపోతోంది.
ప్రధాన మంత్రి పదవికి జన్మతః హక్కు కలిగి ఉన్నాననుకునే రాహుల్ గాంధీ ఒకానొక దశలో కాడి పక్కన పడేసి ‘రాజకీయ సెలవు’ కూడా తీసుకున్నారు.
ఆ తర్వాత ఆయన సోదరి ప్రియాంక వాద్రా కూడా కాంగ్రెస్‌లో చురుకుగా పాల్గొనాల్సి వచ్చింది. ఆమె వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ కూడా పుంజుకున్నారు. భారత్ జోడో యాత్ర చేశారు.
ఆ యాత్ర ఫలమో లేక రాష్ట్ర స్థాయి నేతల సొంత బలం వల్లనో దక్షిణాదిన తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. తమిళనాడులో డీఎంకే చెయ్యొదిలేసి విజయ్ చెయ్యి పట్టుకొని అక్కడా అధికారంలో భాగస్వామి కాగలిగింది. కనుక ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఆత్మవిశ్వాసం పెరిగింది.
మోడీ ప్రభుత్వం వరుసగా మూడుసార్లు అధికారంలో కొనసాగుతోంది కనుక దేశ ప్రజలలో ఎంతో కొంత వ్యతిరేకత నెలకొంటుంది.
బిజేపి దెబ్బకు అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, కేసీఆర్, బిజూ పట్నాయక్ వంటి గండరగండలు చేతులెత్తేశారు. కనుక దేశంలో బిజేపి వ్యతిరేక పార్టీలకు, శక్తులను, ముఖ్యంగా ఇండియా కూటమిలోని భాగస్వాములకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పెద్ద దిక్కుగా కనిపిస్తోంది.
ఈ రాజకీయ మార్పులను, కలిసి వస్తున్న ఈ అవకాశాలను కాంగ్రెస్ అధిష్టానం బాగానే గుర్తించింది. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమీషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ నేడు బాగానే హడావిడి చేసింది.
ఇక ముందు కూడా కాంగ్రెస్ అధిష్టానం ఇదేవిధంగా దూకుడుగా వ్యవహరించగలిగితే, తప్పకుండా దేశ ప్రజలు, ప్రాంతీయ పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీని బిజేపికి ప్రత్యామ్నాయంగా అంగీకరిస్తారు.
అయితే రాహుల్ గాంధీ తన నాయకత్వ లక్షణాలు నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీలో బ్యారికేడ్లపై నిలబడి జెండా ఊపితే సరిపోదు.
There is a strange problem with the promotions of Ranabaali. The film has a big…
In Tollywood, many directors want complete control over their films but fail to give screenwriting…