రాజకీయం కాదు మానవత్వమే…!

రాజకీయాలకు కాదేది అనర్హం అనేది రాజకీయాలలో ప్రముఖంగా వినిపించే నానుడి. అయితే ఒక్కోసారి రాజకీయాలను దాటి మానవత దృక్పధంతో స్పందించాల్సి ఉంటుంది. హాధ్రస్ ఘటన పై నేడు కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ ఈ మానవత కోణంలోనే తన స్పందనను తెలియచేసారు.

హాధ్రస్ ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించిన రాహుల్ ఈ ఘటన పై రాజకీయ కోణంలో మాట్లాడాలని కానీ, రాజకీయ విమర్శలు చేయాలన్నది తన ఉద్దేశం కాదని కేవలం బాధితుల పక్షాన మాత్రమే తన సందేశాన్ని ఇస్తున్నానంటూ వ్యాఖ్యానించారు.

ADVERTISEMENT

స్వామిజీ కాలి మట్టి కోసం భక్తుల మధ్య తోపులాట జరిగి వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు యూపీ ప్రభుత్వం వీలైనంత ఎక్కువ పరిహారం ఇవ్వాలంటూ ప్రభుత్వానికి సూచన చేసారు. ఇటువంటి ఘటనలు రాజకీయ కోణంలో కాకుండా మానవత కోణంలో ఆలోచించి అందరూ అడుగు ముందుకేసి బాధితులకు అండగా ఉండాలంటూ పిలుపునిచ్చారు.

అలాగే తొక్కిసలాట జరిగిన ప్రదేశంలో కావాల్సిన స్థాయిలో పోలీస్ భద్రత లేదని బాధితులు ఆరోపిస్తున్నారని, ఈ విషయమై ప్రభుత్వం వెంటనే విచారం చేపట్టి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. అలాగే తొక్కిసలాటలో గాయపడిన వారికీ కూడా ప్రభుత్వం తక్షణ సాయం కింద పరిహారం చెల్లించాలన్నారు.

తమ రాజకీయ ప్రత్యర్థి అయినా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఈ విధమైన ఘోర సంఘటన జరిగినప్పటికీ దానిని రాజకీయ కోణంలోకి మార్చకుండా రాహుల్ చాలా హుందాగా ప్రవర్తించారని చెప్పాలి. తాము అధికారంలో లేని ఏ ప్రాంతంలోనైనా ఇటువంటి దురదృష్టకర సంఘటనలు జరిగితే అక్కడ ఉన్న ప్రతిపక్షాలు ఇది ప్రభుత్వ తప్పిదమని, అధికారుల నిర్లక్ష్యమని నేరం మొత్తం ప్రభుత్వం వైపు నెట్టి శవ రాజకీయాలు మొదలుపెడ్డుతారు.

కానీ ప్రతిపక్షంలో ఉన్న రాహుల్ అందుకు భిన్నంగా స్పందించి రాజకీయాలలో హుందాతనాన్ని పెంచారు. తప్పు జరిగింది. దానికి బాధ్యులైన వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకుని బాధితులకు అండగా నిలబడడమే ప్రభుత్వ తక్షణ కర్తవ్యం అంటూ ప్రభుత్వానికి తన బాధ్యతను గుర్తుచేశారు. అలాగే బాధిత కుటుంబాలను రెచ్చకొట్టి దాని నుంచి రాజకీయ లబ్ది ఆశించకుండా రాహుల్ వ్యవహరించిన తీరు హర్షణీయం.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Finally, Pressure Starting On Jagan And Co?

YS Jagan has been very successful when it comes to mitigating the legal and judicial…

31 minutes ago

Forget Reels, Focus on Real Life: Suriya

Actor Suriya has a message for students who spend too much time making reels, focus…

1 hour ago