
Rahul Gandhi, Narendra Modi and Chandrababu Naidu Politics
రాష్ట్రాలను, దేశాన్ని పాలించేందుకే ప్రజలు తమకు నచ్చిన రాజకీయ పార్టీలను ఎన్నుకుని అధికారం కట్టబెడతారు. కొన్ని ప్రభుత్వాలు సక్రమంగా, సమర్ధంగా పని చేయవచ్చు. కొన్ని చేయకపోవచ్చు. ఆంధ్రాలో కూటమి, వైసీపీ ప్రభుత్వాలే ఇందుకు చక్కటి నిదర్శనం.
అయితే అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇలాంటి సమస్యలున్నాయి. ఉదాహరణకు అమెరికా ప్రజలు ట్రంప్‌ని అధ్యక్ష పీఠం ఎక్కిస్తే ఆయన ఏం చేస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు.
కనుక చక్కగా పని చేసే ప్రభుత్వాల వలన ఏ సమస్య ఉండదని అనుకోవడానికి లేదు. మోడీ ప్రభుత్వానికి నీట్ సమస్య శీలపరీక్ష పెట్టింది. దానికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది.
మొదట ఆయన రాజినామాయే ఈ సమస్యకు పరిష్కరమన్నట్లు కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ వాదించారు. ఇప్పుడు హోంమంత్రి అమిత్ షా కూడా రాజీనామా చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఒకవేళ అయన కూడా రాజీనామా చేస్తే కాంగ్రెస్ పార్టీకి మరింత విజయోత్సాహం కలుగుతుంది. కనుక అప్పుడు ప్రధాని మోడీ రాజీనామా కోరవచ్చు.
ఇదేవిధంగా ఏపీలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ వైసీపీ, తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న విద్యాశాఖని వేరే వారికి అప్పగించాలంటూ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాయి.
అంటే ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలలో ఎవరెవరు ఉండాలో, ఏవిధంగా పని చేయాలో తాము నిర్దేశిస్తే వాటిని ప్రభుత్వాలు పాటించాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయన్న మాట!
ప్రభుత్వాలు చేసే తప్పిదాలను నిలదీసి ప్రశ్నించడం అవసరమే. కానీ ఆ పేరుతో ప్రభుత్వాలను శాశించాలనుకోవడమే తప్పు.
గతంలో యూపీఏ పాలనలో దేశంలో ఎన్ని కుంభకోణాలు, ఉగ్రదాదులు జరిగాయో దేశ ప్రజలందరూ కళ్ళారా చూశారు. అదేవిధంగా ఐదేళ్ళ పాలనలో జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏవిధంగా భ్రష్టు పట్టించారో అందరూ చూశారు.
కానీ ఇప్పుడు కాంగ్రెస్ నేతలు మోడీ ప్రభుత్వం, వైసీపీ నేతలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తాము చెప్పినట్లే నడుచుకోవాలని ఆశిస్తున్నాయి. ఇది అత్యాశే కదా?
ప్రతిపక్షాలు చేస్తున్న ఈ రాజకీయాలు చూస్తుంటే వాటి పోరాటం నీట్ లేదా విద్యార్ధుల కోసం కాదని రాజకీయ ఆధిపత్యం కోసమేనని స్పష్టం అవుతోంది. సీజేపీ ఒత్తిళ్ళకు తలొగ్గి కేంద్ర మంత్రి చేత రాజీనామా చేయించడంతో, ఇప్పుడు అది కూడా మోడీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని బెదిరిస్తోంది.
ఈవిధంగా ప్రభుత్వాలని శాశించాలనుకోవడం, వాటిని బలహీనపరిచి కూల్చాలనుకోవడం రాజకీయమా? ప్రజాస్వామ్యమా?
India beat Afghanistan by 7 wickets in the second T20I in Delhi to take an…
With Rohith and Trigun emerging as the potential gamers in the Bigg Boss reality show,…