
Rahul Gandhi's Phone Tapping Allegations Against PM Modi
సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉన్న రాజకీయ ప్రముఖులలో రాహుల్ గాంధీ కూడా ఒకరు. కానీ ప్రింట్ మీడియాలో ఆయన గురించి వార్తలు వస్తే పట్టించుకునేవారు చాలా తక్కువే… అంటే కాంగ్రెస్ నేతలకు కోపం రావచ్చు.
అయన ఎప్పటికైనా ప్రధాన మంత్రి పదవి అవుతారో లేదో కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఆయనే యువరాజు, పార్టీ అధినేత, భావి ప్రధాని.. అన్నీను. కనుక ఆయన గురించి రెండు ముక్కలు చెప్పుకోక తప్పదు.
ప్రధాని మోడీ ‘ఓట్ చోరీ’కి పాల్పడుతున్నారని ఆరోపిస్తున్న అయన, గత కొన్ని వారాలుగా ప్రధాని మోడీ, అమిత్ షా ఇద్దరూ దేశ ద్రోహులే! తన ముందుకు వస్తే 5 నిమిషాలలో వాళ్ళిద్దరూ దేశద్రోహులని నిరూపిస్తానంటూ సవాళ్ళు విసురుతున్నారు.
తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం ‘ఆస్క్ మీ’ ద్వారా పలువురు ప్రశ్నలకు సమాధానాలు రాహుల్ గాంధీ చెప్పారు.
వాటిలో ఓ ప్రశ్నకు సమాధానం చెబుతూ, ప్రధాని మోడీ తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ బాంబు పేల్చారు. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు వాటిని బయట పెడతానని చెప్పారు.
ఇదివరకు తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరి ఫోన్లు ట్యాపింగ్ చేయించారంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విచారణ జరిపించింది. దానిలో అనేక ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. కానీ ఆ కేసు విచారణ ఎప్పుడు పూర్తవుతుందో తెలీని పరిస్థితి!
తెలంగాణ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్, రాష్ట్ర రాజకీయాలను కంటి సైగతో శాశిస్తున్న సిఎం రేవంత్ రెడ్డే, మూడేళ్ళలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ముగించలేకపోతున్నారు. కానీ ఈ కేసు పేరుతో కేసీఆర్ ప్రతిష్ట మసక బారేలా చేయగలిగారు.
కనుక రాహుల్ గాంధీ కూడా ఇదే ఐడియా ఉపయోగిస్తున్నారా? అనే సందేహం కలుగుతుంది. ఎందుకంటే, పదేపదే ఇలాంటి ఆరోపణలు చేస్తూ ప్రజలలో అనుమాన బీజాలు నాటగలిగితే చాలు.. ఎంతటి వారైన దెబ్బయిపోతారని కేసీఆర్ పరిస్థితి చూస్తే అర్ధమవుతోంది కదా?
అయితే ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ చేసిన ఈ ఆరోపణ మామూలుది కాదు. కనుక కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించి తగు చర్యలు చేపట్టడం చాలా అవసరం.
Andhra Pradesh Chief Minister Chandrababu Naidu said industrialists have gained confidence in the state government's…
Rana Daggubati is looking beyond just producing another film with Scary Picture. The actor-producer has…