
కాంగ్రెస్ పార్టీకి మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షుడు కావచ్చు. కానీ దేశంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, పార్టీ నేతలు అందరూ కూడా నేటికీ సోనియా, రాహుల్ గాంధీలనే పార్టీ అధినేతలుగా గుర్తిస్తారు. సమస్యలు, అవసరాల కోసం వారి వద్దకే వెళుతుంటారు.
రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయడమే తమ ఏకైక లక్ష్యమని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి వంటివారు కూడా చెపుతుంటారు. దేశ రాజకీయాలను ప్రధాని మోడీ, అమిత్ షాలు శాశిస్తుంటే వారిని ధైర్యంగా ఎదుర్కొనే నేతగా రాహుల్ గాంధీ నిలుస్తున్నారు. కనుక దేశంలో కాంగ్రెస్ పార్టీని మాత్రమే కాక రాజకీయాలను కూడా రాహుల్ గాంధీ శాశిస్తున్నారని చెప్పవచ్చు.
ఆ స్థాయి నాయకుడు నేడు చెన్నైలో టీవీకే పార్టీ అధినేత విజయ్ తమిళనాడు సిఎంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవడం మామూలు విషయం కాదు. కానీ కాంగ్రెస్ మద్దతుతో సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ పక్కన రాహుల్ గాంధీని చూసినప్పుడు అయ్యో పాపం అనికూడా అనిపిస్తుంది.
ఎందుకంటే రాహుల్ గాంధీ ఇలాంటి ప్రమాణ స్వీకార కార్యక్రమాలకి, రాజకీయ నాయకుల కొడుకులు, కూతుర్ల పెళ్ళిళ్ళకి తప్పక హాజరవుతుంటారు. విజయ్ ఇప్పటికే భార్యకు విడాకులు ఇచ్చేసి (త్రిషతో) రెండో పెళ్ళికి సిద్ధమవుతున్నారు. కానీ రాహుల్ గాంధీ పెళ్ళి ఎప్పుడో… అసలు చేసుకుంటారో లేదో ఎవరికీ తెలీదు. ప్రధాన మంత్రి పదవి కోసం బ్రహ్మచర్యం పాటిస్తున్నారా? లేక పెళ్ళి చేసుకునే ఉద్దేశ్యం లేదా?ఎవరికీ తెలీదు.
అలాగే రాహుల్ గాంధీ ‘ప్రధాన మంత్రి అభ్యర్ధి’గా బాగానే పాపులర్ అయ్యారు. కానీ పదేళ్ళ పాటు ఆ అవకాశం ఉన్నప్పుడు వద్దనుకున్నారు. ఇప్పుడు కావాలని కోరుకుంటున్నా దక్కేలా లేదు.
దేశంలో నానాటికీ పెరుగుతున్న బిజేపి బలం, మారిన రాజకీయ పరిణామాలు చూస్తున్నప్పుడు భవిష్యత్‌లో ప్రధానమంత్రి అవుతారనే నమ్మకం కూడా సన్నగిల్లుతోంది.
కనుక రాహుల్ గాంధీ ఇతరుల ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు హాజరయ్యి ఫోటోలు దిగడమే తప్ప ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఫోటో చూసే భాగ్యం కాంగ్రెస్ నేతలకు లేదేమో? అనిపిస్తుంది.
Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…
The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…