Telugu

రాహుల్ ‘యాంటీ ఇండియా’ రాజకీయాలు చేస్తున్నారా.?

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఎంత ముఖ్యమో, ఆ విమర్శల్లో బాధ్యతాయుతమైన వైఖరి కూడా అంతే ముఖ్యం. ప్రభుత్వ విధానాలను తప్పుబట్టడం, దేశంలో నెలకొన్న సమస్యలను ఎత్తిచూపడం ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ బాధ్యతే.

అయితే ఆ విమర్శలకు ఎంచుకుంటున్న వేదిక, ఉపయోగిస్తున్న పదజాలం ఇప్పుడు రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా విదేశీ గడ్డపై భారత ఆర్థిక వ్యవస్థపై ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ ప్రతిష్ఠకు సంబంధించిన ప్రశ్నలను తెరపైకి తెస్తున్నాయి.

ADVERTISEMENT

US లోని కొలంబియా యూనివర్సిటీలో విద్యార్థులు, అధ్యాపకులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో రాహుల్ గాంధీ భారత ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో భారీ నిరుద్యోగ సమస్య ఉందని, విద్యావ్యవస్థలో లోతైన లోపాలున్నాయని, తయారీ రంగం బలహీనపడిందని వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా భారత ఆర్థిక నమూనా దాదాపు దశాబ్ద కాలంగా ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదని విమర్శించారు. ‘భారత్ ఆర్థిక విపత్తు అంచున ఉంది’ అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరోవైపు భారత్ అంతర్జాతీయంగా ఆర్థికంగా ఎదుగుతున్న దేశాల్లో ఒకటిగా మంచి గుర్తింపు పొందుతోంది.

మేకిన్ ఇండియా నినాదంతో ప్రపంచ పెట్టుబడుల ఆకర్షణ, డిజిటల్ విప్లవం, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి రంగాల్లో పురోగతి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థపై ఒకే కోణంలో ప్రతికూల వ్యాఖ్యలు చేయడం వాస్తవ పరిస్థితులకు పూర్తి ప్రతిబింబం కాదనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

అభివృద్ధిని మాత్రమే చూపించి సమస్యలను విస్మరించలేం.. అలాగే సమస్యలను మాత్రమే చూపించి అభివృద్ధిని తక్కువ చేయలేం. ఈ నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. విదేశీ గడ్డపై భారతదేశ ప్రతిష్ఠను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారంటూ విమర్శించింది.

దేశాన్ని ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా అంతర్జాతీయ సంస్థలు గుర్తిస్తుంటే, రాహుల్ మాత్రం భారతదేశాన్ని ఆర్థిక విపత్తుగా చిత్రీకరిస్తున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు. మరో అడుగు ముందుకేసి ఆయనను ‘యాంటీ ఇండియా ప్రాపగాండా’కు నాయకుడిగా అభివర్ణిస్తున్నారు.

అయితే కాంగ్రెస్ – బీజేపీ నాయకుల వాదనలు ఎలా ఉన్నప్పటికీ భారత ప్రధాని పదవి పీఠం కోసం రాజకీయ పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ ఆయన పోరాటానికి ప్రజల మద్దతు ముఖ్యంగా యువత మద్దతు లభించాలంటే ఇలా భారతదేశ ఆర్థిక వ్యవస్థను విదేశాల్లో హేళన చేయకపోవడమే ఆ రాజకీయ భవిష్యత్ కి మేలు అనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ram Charan Must Be Watching Dhanush’s Film?

Ram Charan has been rather slow with his film choices in recent years, as his…

16 minutes ago

WTC Final: India’s Qualification Scenario Explained

India have seven Tests remaining in the World Test Championship (WTC) 2025-27 cycle, but their…

46 minutes ago