రాహుల్ X పోస్టులు : రేపటి కోసమేనా.?

సినీ నటుడు రాహుల్ రామకృష్ణ తన పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారా.? అందులో భాగంగానే ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ టార్గెట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారా.? జై తెలంగాణ అనే నినాదంతో ఏపీ మంత్రి పై ప్రశ్నలు సంధిస్తున్న రాహుల్ ఎవరు వదలబోతున్న బాణంగా రాజకీయ కురుక్షేత్రంలోకి దిగబోతున్నారు.?

తాజాగా రాహుల్ రామకృష్ణ తన సోషల్ మీడియా వేదిక గా రెండు తెలుగు రాష్ట్రాలలో గిరిజన హక్కుల కోసం ఉద్దేశించిన ‘పెసా’ చట్టం గురించి ప్రశ్నించారు. అలాగే క్షేత్ర స్థాయిలో పెసా చట్టం అమలు తీరు ఏవిధంగా జరుగుతుంది అని తెలుసుకునేందుకు గాను సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకున్నారు.

ADVERTISEMENT

ఆర్టీవో చట్టం ద్వారా తానూ అడిగిన ప్రశ్నలకు పూర్తి సమాచారం అందించాలంటూ ఆయా శాఖకు దరఖాస్తు దాఖలు చేసి ‘లెట్స్ వెయిట్ అండ్ వాచ్’ అంటూ X లో పోస్ట్ పెట్టారు రాహుల్. అయితే ఒక సెలబ్రెటీ గా, సామాన్యుడిగా ప్రభుత్వం అమలు చేసే చట్టాల గురించి తెలుసుకోవడాన్ని ఎవరు తప్పుబట్టారు, కానీ ఒక వ్యక్తి టార్గెట్ గా రాహుల్ చేయాలనుకుంటున్న రాజకీయాన్ని మాత్రం ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు.

ఇప్పుడే ఎందుకు.? వై ఓన్లీ పవన్.? అంటూ ఇప్పటికే గతంలో రాహుల్, పవన్ టార్గెట్ గా వేసిన ప్రశ్నలకు రాహుల్ కు ఎదురు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. సోషల్ మీడియా లో రాహుల్ తన తీరు పై కనిపిస్తున్న ఎదురుదాడి నుంచి కాస్త ఉపశమనం పొందడానికే ఈసారి రాహుల్ రామకృష్ణ రెండు తెలుగు రాష్ట్రాలు అంటూ కథను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారా.?

జై తెలంగాణ నినాదానికి దూరంగా ఈ సారి గిరిజన హక్కుల పేరుతో రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియా పోస్టులతో వేస్తున్న ఈ అడుగులు తెలంగాణలో రేపటి తన రాజకీయ భవిష్యత్ కోసమేనా.? అందుకోసం రాహుల్ ముందుగా పవన్ టార్గెట్ గా ముందుకెళ్లాలని భావిస్తున్నారా.?

మీడియా అటెన్షన్ కి, సోషల్ మీడియాలో ప్రచారానికి ఇటువంటి వారికీ పవన్ సాఫ్ట్ టార్గెట్ గా మారారా.? ప్రొఫెసర్ నాగేశ్వరరావు వివాదం తరువాత తెలంగాణలో పవన్ కళ్యాణ్ టార్గెట్ గా తెరవెనుక చాల పెద్ద కథే నడుస్తుంది అనేలా రాజకీయ విశ్లేషకుడు నాగేశ్వరరావు మొదలుకుని తెలంగాణ సీనియర్ జర్నలిస్టుల వరకు,

ఇక ఇటు పొలిటికల్ గా చూస్తే అధికార కాంగ్రెస్ మొదలుకుని ప్రతిపక్ష బిఆర్ఎస్, తెరాస 2.0 కవిత వరకు అందరు పోటీపడి మరి పవన్ టార్గెట్ గా ప్రాంతీయవాద రాజకీయాన్ని తెరమీదకు తెచ్చారు. ఇక ఇపుడు ఎవరు ఉహించని రీతిలో సినీ నటుడు రాహుల్ రామకృష్ణ పవన్ ను, ఆయన శాఖను వేలెత్తి చూపుతూ తెరమీదకు వచ్చారు.

ఇక నెక్స్ట్ ఎవరు అన్నట్టుగా సాగుతున్న ఈ తెలంగాణ రాజకీయంలో పవన్ అభిమన్యుడి మాదిరి ఒంటరి పోరాటం చేస్తారా.? లేదా అర్జునిడి మాదిరి శ్రీ కృష్ణుడి సాయం కోరతారా.? మరి ఇక్కడ పవన్ కు మార్గం చూపే ఆ శ్రీ కృష్ణుడు ఎవరు.?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

AK47: Trivikram & Naga Vamsi Fumble Golden Dasara Window

Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…

4 hours ago

New Passport Rules for Minors NRI Parents Must Know

The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…

4 hours ago