Telugu

మహేష్ బాబు ఎన్ని టేక్ లైనా తీసుకుంటారు!

‘అందాల రాక్షసి’ సినిమా ద్వారా పరిచయమైన రాహుల్, ప్రిన్స్ మహేష్ బాబుకు అభిమాని అన్న విషయం తెలిసిందే. ఆ అభిమానంతోనే ‘శ్రీమంతుడు’ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించాడు రాహుల్. తాజాగా తన సినీ విశేషాలను పంచుకున్నాడు రాహుల్. ‘తన మొదటి సినిమాయే తనకు పేరు తేవడం అదృష్టమని, ప్రస్తుతం తాను మూడు సినిమాల్లో నటిస్తున్నానని, ఒక సినిమా షూటింగ్ పూర్తి కావస్తోందని అన్నారు.

ఇక, ప్రముఖ హీరో ‘శోభన్ బాబు’ టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నానని, ఇందులో ముగ్గురు హీరోయన్లు ఉండడంతో దానికి ‘శోభన్ బాబు’ అని పేరు పెట్టారని, గతంలో ‘శోభన్ బాబు’ సినిమాల్లో ఇద్దరు లేదా ముగ్గురు హీరోయిన్లు ఉండేవారని గుర్తుచేశాడు. అలాగే గత వారమే ఒక సినిమాకు సంతకం చేశానని, ఈ మూడు సినిమాలు తన ఫేట్ ను నిర్ణయిస్తాయని రాహుల్ వెల్లడించాడు.

ADVERTISEMENT

ఇక, సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ‘శ్రీమంతుడు’ సినిమాలో నటించడం మిక్కిలి సంతోషాన్ని ఇచ్చిందని, షాట్ సరిగ్గా వచ్చేందుకు ఎన్ని టేకులైనా తీసుకుంటారని, ఈ సినిమాలో మహేశ్ బాబును చూస్తూ చాలా విషయాలు నేర్చుకున్నానని, అంత పెద్ద నటులుగా ఎదిగినా, వారు ఓపిగ్గా నటించే విధానమే వారిని స్టార్లను చేసిందనిపిస్తుందని… సెట్స్ లో ప్రిన్స్ విధానాలను ప్రశంసించాడు ఈ ‘శోభన్ బాబు.’

Share
Akhil

Akhil, a passionate young writer, started his journey at M9 News and has since become a key member of the team. With a deep love for Telugu cinema, Hyderabad city news, and a keen interest in general affairs, Akhil br…

Published by

Recent Posts

బరిలో గెలిచింది ఇంట్లో ఓడింది.. పాపం రెజ్లర్ అశ్విని

మహారాష్ట్ర ఆడపులిగా పేరు గాంచిన మహిళా రెజ్లర్ అశ్విని మనోహర్ పాల్ తన ముగ్గురు పిల్లలతో కలిసి దారాశివ్ జిల్లాలోని…

19 minutes ago

Paparazzi Push Too Far, Salman Khan Hits Back

Salman Khan has lost his cool at the paparazzi once again. This time, the incident…

19 minutes ago