Telugu

రాజ్ తరుణ్ సినిమా అటు నుండి ఇటు

టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ యొక్క ఇటీవలి చిత్రం, ఒరే బుజ్జిగా తన థియేట్రికల్ విడుదలను దాటవేసి, అక్టోబర్లో అల్లు అరవింద్ కి చెందిన ఓటీటీ ప్లాట్‌ఫామ్, ఆహా వీడియోలో ప్రసారం చెయ్యబడింది. ఈ చిత్రం ఓకే అనిపించేలా టాక్ మరియు రివ్యూలు వచ్చాయి. రొటీన్ కథ అయినా కామెడీ వర్క్ అవుట్ కావడంతో ఆహాలో బానే వ్యూస్ వచ్చాయి.

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరవడంతో, మేకర్స్ ఇప్పుడు 2021 జనవరి 1 న న్యూ ఇయర్ స్పెషల్‌గా ఈ సినిమా థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతున్నారు. ఇది 2021 లో టాలీవుడ్ మొదటి రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు … 50% ఆకుపెన్సీ రూల్ కారణంగా ఆన్‌లైన్లో విడుదలైన సినిమాలను సమ్మర్ 2021 వరకు థియేటర్లలో విడుదల చేయడం మంచి ఆలోచనే.

ADVERTISEMENT

అయితే, ఇది కనిపించినంత సులభం కాదు. మొదట, ఈ సినిమాల యొక్క ఎక్సక్లూజివ్ హక్కులు పొందిన ఓటీటీలు ఇటువంటి ఒప్పందాలకు ఒప్పుకోవాలి. మరోవైపు…. ఇప్పటికే డైరెక్ట్ గా ఆన్లైన్ లో విడుదలైన సినిమాలను స్క్రీన్ చెయ్యకూడదని తీర్మానించుకున్న మల్టీప్లెక్స్ చైన్లను ఒప్పించాలి.

ఒరే బుజ్జిగా మాస్ ప్రేక్షకుల కోసం నిర్మించిన చిత్రం కావడం తో… సింగిల్ స్క్రీన్ థియేటర్లలోనే విడుదల చేసినా పెద్దగా నష్టం ఉండదు. మరోవైపు… ఆహాకే చెందిన మరో డైరెక్ట్ ఆన్లైన్ రిలీజ్ కలర్ ఫోటో కూడా థియేటర్లలో విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ramayana’s Big Release Gets a Tax-Free Push

Ramayana has received a Big boost ahead of its theatrical release. As per the latest…

5 minutes ago

Was Tiger Shroff an Easier Target?

According to reports, the shooters may have initially planned to target Salman Khan but allegedly…

35 minutes ago