
అమరేంద్ర బాహుబలి, కట్టప్ప కుంతల దేశానికి వెళ్ళినపుడు చాలా మంచి సన్నివేశాలు ఉన్నాయి, బాగా వర్కౌట్ అయ్యేవి కూడా. ఇక బాహుబలి హీరోయిజాన్ని చూపించే సీన్లు కూడా చాలా ఉన్నాయి. అలాగే భళ్ళాలదేవుడు – బాహుబలి మధ్య ఇందులో సీన్లేవి లేవు గానీ, స్క్రిప్ట్ దశలో చాలా మంచి సీన్లు రాసుకున్నాం. అవి తెరకెక్కించలేదు. ముఖ్యంగా శివగామి బాహుబలిని చంపేయమని కట్టప్పకు చెప్పినపుడు వెంటనే ఒప్పుకోడు. అక్కడ చాలా ఏమోషన్ డ్రామాకు అవకాశం ఉంది. అలాగే శివగామి కూడా అంత ఈజీగా బాహుబలిని చంపేయమని చెప్పడం వెనుక ఇంకాస్త బ్యాక్ గ్రౌండ్ ఉంటే బాగుంటుందనిపించింది.
ఈ సీన్లలో చాలా చూపించవచ్చు. అయితే ఇప్పటికే రెండు గంటల నలభై నిముషాలు పైనే సినిమా అయ్యిందని, ఇక అవి కూడా తోడయితే ఏ నాలుగు గంటలో అవుతుందని, అందుకే చిత్రీకరించలేదని చెప్పుకొచ్చారు జక్కన్న. నిజమే… రాజమౌళి చెప్పిన సన్నివేశాలలో చాలా స్కోప్ ఉంది. వాస్తవానికి సినిమా విడుదలైన తర్వాత విమర్శకులు కూడా అదే అభిప్రాయపడ్డారు. శివగామి అంత తేలికగా బాహుబలిని చంపేయమనడం ఏంటన్న భావనలు వ్యక్తమయ్యాయి. రాజమౌళికి సంతృప్తి కలిగే విధంగా ఆయా సీన్లు కూడా తోడయితే సినిమా అద్భుతంగా ఉండేదేమో గానీ, ఇంతలా అయితే ఆడేది కాదేమో!
సహజంగా రెండున్నర్ర గంటలున్న సినిమాను చూడడమే తెలుగు ప్రేక్షకులకు అలవాటు. ఏదైనా మరో పదిహేను నిముషాలు అటు ఇటుగా ఉంటే పర్లేదు గానీ, అది మూడు గంటలకు చేరుకుంటే మాత్రం తెలుగులో కష్టమేనని చెప్పవచ్చు. గతంలో చాలా సినిమాలు విడుదలైన తర్వాత కోతలకు గురైన విషయం తెలిసిందే. అందులోనూ ‘బాహుబలి 2’ విషయంలో సెకండాఫ్ లో కాస్త సాగదీసారన్న టాక్ కూడా వెలువడింది. ఇక ఈ సన్నివేశాలు కూడా ఉంటే, అది అన్ని వర్గాల ప్రేక్షకులను సంతృప్తి పరిచేది కాదని చెప్పవచ్చు. ఆ విషయం రాజమౌళికి కూడా తెలుసు కాబట్టే… తను అనుకున్న సూపర్ సీన్స్ లేకపోయినా పర్లేదని, నిడివిని అక్కడితో కుదించారు.
Romanchakam is produced by Bhadrakali Pictures, the banner of Sandeep Vanga and Pranay Vanga, who…
Ravi Teja made a comeback of epic proportion with his latest film Irumudi. This devotional…