Telugu

చెర్రీ ఫ్యాన్స్ హర్ట్ అవుతారేమో!

గడిచిన కొద్దీ గంటలుగా సోషల్ మీడియాలో రాజమౌళికి సంబంధించిన ఓ వీడియో హల్చల్ చేస్తోంది. ‘కొమురం భీముడో’ పాటలో జూనియర్ ఎన్టీఆర్ అభినయానికి సంబంధించి ఓ భారీ ప్రకటనే ఇచ్చారు. ఇది అతి పెద్ద స్టేట్మెంట్ అని తనకు తెలుసు, కానీ దానికి అన్ని విధాలా జూనియర్ ఎన్టీఆర్ అర్హుడు అంటూ కితాబిచ్చారు.

‘కొమురం భీముడో’ పాటలో జూనియర్ ఎన్టీఆర్ ప్రదర్శించిన హావభావాలు, ఇండియాలో మరే ఇతర నటుడు ప్రదర్శించలేడని, ఇది చాలా పెద్ద ప్రకటన అని నాకు తెలుసు, కానీ ఆ మేరకు తారక్ నటించాడని దర్శకధీరుడు చెప్పుకొచ్చారు. ఒకే షాట్ లో అన్ని ఏమోషన్స్ పండించడం ఎవరి వల్లా కాదని, అది నటనకు ఎవరెస్టుగా కీర్తించారు.

ADVERTISEMENT

సినిమాలో రామ్ చరణ్ ను హైలైట్ చేసి, జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ను తగ్గించారని తెగ ఫీల్ అయిపోతున్న తారక్ ఫ్యాన్స్ కు ఈ వీడియో మంచి జోష్ నిచ్చింది. “ఆర్ఆర్ఆర్” దర్శకుడు రాజమౌళి స్వయంగా ఈ స్థాయిలో ప్రశంసలు ఇవ్వడంతో, ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ వీడియోను షేర్ చేసుకుంటూ సందడి చేస్తున్నారు.

అయితే ఇంత పెద్ద స్టేట్మెంట్ విన్న రామ్ చరణ్ ఫ్యాన్స్ సంగతేంటి? ఇద్దరు హీరోలు ఉండగా ఒక హీరోను ప్రశంసించి, మరో హీరో గురించి చెప్పకపోతే ఫ్యాన్స్ ఊరుకుంటారా? అయితే రామ్ చరణ్ రోల్ కు హీరోయిజం పాళ్ళు కాస్త ఎక్కువగా ఉన్నాయన్న ఆనందంలో “ఆర్ఆర్ఆర్” విడుదలైన నాటి నుండి చెర్రీ ఫ్యాన్స్ ఉన్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by
Tags: RRR

Recent Posts

Pradhama Drishtiya Kuttakkar OTT: Not Worth the Hype?

The OTT premiere of Pradhama Drishtiya Kuttakkar on Netflix has sparked discussion among viewers. The…

18 minutes ago

Ramayana Experience: Best Format for Hyderabad Fans?

The wait is finally over! The makers of Ramayana, backed by producer Namit Malhotra, have…

37 minutes ago