
జక్కన్నతో సినిమా అంటే మాములుగా ఉండదని ఇండస్ట్రీలో కూడా పెద్ద టాకే ఉంది. అలాంటి జక్కన్నను సోషల్ మీడియా వివిధ సందర్భాలలో ట్రోల్స్ చేసింది. ముఖ్యంగా “ఆర్ఆర్ఆర్” రిలీజ్ డేట్స్ కు సంబంధించి వివిధ సందర్భాలలో రాజమౌళి ఇచ్చిన స్టేట్మెంట్స్ తో నెట్టింట అనేక మేమ్స్ ఉన్నాయి. అయితే ఆ మేమ్స్ ప్రత్యక్షంగా రాజమౌళి చూస్తే రియాక్షన్ ఏమిటి?
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ సుమ అలాంటి ప్రయత్నమే చేసింది. 2020లో ఎట్టి పరిస్థితులలో సినిమా విడుదల అవుతుందని రాజమౌళి ఇచ్చిన స్టేట్మెంట్ కు, ప్రస్తుతం జరుగుతున్న దానికి ఎక్కడా పొంతన లేకపోవడం హాస్యాస్పదంగా మారింది. అయితే వీటికి రవితేజ హావభావాలతో కూడిన మేమ్ మరింత వినోదాన్ని పండించింది.
ఈ మేమ్ చూసిన రాజమౌళి ఫక్కున నవ్వేయగా, పక్కనే ఉన్న రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు కూడా మిక్కిలి సంతోషించారు. బహుశా తాము చెప్పలేని విషయాన్ని మేమ్ ద్వారా నెటిజన్లు తెలియజేశారనుకున్నారో ఏమో గానీ, చెర్రీ, తారక్ ల నుండి అదిరిపోయే స్పందన లభించింది. మేమ్స్ వినోదభరితంగా ఉంటే ఇలాగే ఉంటాయి మరి! అయితే వాటిని స్వీకరించే మనసు ఉండాలి.
రాజమౌళి లాగా అందరూ స్వీకరించలేరు కదా! ఎందుకంటే ఇటీవల ఓ లెజెండరీ నటుడు ఈ మేమ్స్ పై తమ అక్కసును వెళ్లగక్కడమే కాకుండా, దీని వెనుక ఓ ప్రముఖ హీరో కూడా ఉన్నాడంటూ చేసిన ప్రకటనలు తెలియనివి కావు. ఇది పక్కన పెడితే తనపై వేసిన మేమ్ కు జక్కన్న ఇచ్చిన రియాక్షన్ కూడా నెట్టింట వైరల్ గా మారింది.
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…