ఎవరికీ దక్కని అవకాశం మహేష్ బాబుకు!

Rajamouli Mahesh Babu New Movie Updatesరాజమౌళి ప్రస్తుతం తన ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం అక్టోబర్ 13 న దసరా స్పెషల్ గా విడుదల కానుంది. అప్పటికి పరిస్థితులు అనుకూలించకపోతే వాయిదా పడే అవకాశాలు లేకపోలేదు.

ఈ చిత్రం తరువాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి పనిచేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు ఇంకా ప్రారంభం కాలేదు అని చెప్పుకొచ్చారు రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్.

ADVERTISEMENT

ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఒక యాక్షన్ ఎడ్వెంచర్ గా ఈ సినిమా రూపొందే అవకాశం ఉందని… విల్బర్ స్మిత్ నవలల ఆధారంగా సినిమా కథ ఉండవచ్చని విజయేంద్ర ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఇప్పటిదాకా రాజమౌళి సినిమాలన్నీ మనం దేశం బ్యాక్ డ్రాప్ లో వచ్చినవే… బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు పీరియడ్ సినిమాల గా వచ్చినా ఇక్కడే జరిగాయి. అయితే మహేష్ కోసం మొట్టమొదటి సారిగా దేశం దాటబోతున్నాడు రాజమౌళి.

ఆ సరికొత్త లొకేషన్స్, అలాగే రాజమౌళి మార్క్ యాక్షన్, ఎమోషన్స్ పడితే కచ్చితంగా ఫ్రెష్ సినిమా వస్తుంది. సీనియర్ నిర్మాత కె.ఎల్. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆయన ఒక దశాబ్దానికి పైగా చిత్రాలకు దూరంగా ఉన్నారు. రాజమౌళి ఆర్ఆర్ఆర్ విడుదల తరువాత ఈ చిత్రం స్క్రిప్ట్ మొదలుపెట్టి బాగా టైం తీసుకునే అవకాశం ఉండటంతో ఈ చిత్రానికి ముందు మహేష్ ఒకటి లేదా రెండు సినిమాలు చేయవచ్చు.

ADVERTISEMENT
Latest Stories