
అయితే అవి పుకార్లు కాదని, నిజంగానే రాజమౌళి – రామ్ చరణ్ మరోసారి జత కలవబోతున్నారని దాదాపుగా ఖరారైంది. ఈ విషయాన్ని అటు రాజమౌళి గానీ, ఇటు మెగా వర్గం గానీ ప్రకటించలేదు గానీ, జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ద్వారా ఈ విషయం తెలిసివచ్చింది. తన తదుపరి సినిమాను రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్నానే మాటపై… అవన్నీ ఒట్టి పుకార్లని తేల్చిన తారక్, తన తదుపరి సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలోనే ఉంటుందని స్పష్టం చేసారు.
అంతేకాదు జక్కన్న చిత్రంపై కూడా ఓ క్లారిటీ ఇచ్చారు. తప్పకుండా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని, అయితే అది ఎప్పుడు ఉంటుందనేది ఆయనే తేల్చాలని, ఇప్పుడైతే ఖచ్చితంగా లేదని ఓ ప్రకటన చేయడంతో, రాజమౌళి తదుపరి హీరోపై క్లారిటీ వచ్చేసినట్లే. అంతకుముందు హల్చల్ చేసిన విధంగా మెగా లాబీయింగ్ వర్కౌట్ అయినట్లుగా కనపడుతోంది. సుకుమార్ దర్శకత్వంలో చేస్తోన్న “రంగస్థలం” సినిమా పూర్తి కాగానే, రాజమౌళి – రామ్ చరణ్ సినిమా సెట్స్ పైకి వెళ్ళే సంకేతాలు కనపడుతున్నాయి.
ఇందుకు అనుగుణంగా తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు కూడా సందడి చేస్తున్నాయి. “రంగస్థలం” సెట్స్ లోకి మెగాస్టార్ చిరంజీవితో కలిసి రాజమౌళి వెళ్ళడం అనేది, దీనికి సంకేతాలు అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇక మిగిలింది అధికారిక ప్రకటన మాత్రమే! అది వచ్చిన తర్వాత మెగా ఫ్యాన్స్ కు రాబోయేదంతా పండగ సమయమే..! మరి వీరిద్దరూ కలిసి “మగధీర 2”ను ప్లాన్ చేస్తారో లేక కమర్షియల్ సక్సెస్ లకు నిలయమైన మాస్ సబ్జెక్ట్ ను ఎంపిక చేసుకుంటారో చూడాలి.
Anaira Gupta is raising temperatures with her sensational new style statement, effortlessly blending relaxed bohemian…
The ongoing year has brought a few surprises in terms of box office numbers and…