
సుకుమార్ దగ్గరే వుండి మొత్తం సెట్ ను రాజమౌళికి చూపించాడు. సెట్ విషయంలో సుకుమార్ తీసుకున్న శ్రద్ధకు రాజమౌళి అభినందనలు తెలియజేశారు. అయితే మళ్లీ ఈ సెట్ కి రాజమౌళి ఎందుకు వచ్చారు? అనే సందేహమే అందరిలోను తలెత్తుతోంది. ఎన్టీఆర్ .. చరణ్ లతో రాజమౌళి ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ గ్రామీణ నేపథ్యంలో నడుస్తుందట. అందుకు ఈ సెట్ ఏవైనా ఉపయోగపడుతుందా అనే విషయాన్ని పరిశీలించడం కోసమే మళ్లీ ఆయన అక్కడికి వెళ్లారనే టాక్ వినిపిస్తోంది.
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…