Telugu

టీవీ9పై పంచ్ పేల్చిన రాజమౌళి!

“ఆర్ఆర్ఆర్” సినిమా ప్రమోషన్స్ నిమిత్తం ఈ రోజు చిత్ర యూనిట్ బెంగుళూర్ వెళ్ళింది. ముంబై ఈవెంట్ కు మిస్ అయిన రామ్ చరణ్ ఈ కార్యక్రమానికి హాజరు కాగా, మీడియా వేసిన పలు ప్రశ్నలకు చిత్ర యూనిట్ బదులిచ్చింది. ఈ క్రమంలోనే టీవీ9కు దిమ్మతిరిగే సమాధానంతో పంచ్ ఇచ్చారు మన దర్శక దిగ్గజం రాజమౌళి.

‘నెక్స్ట్ కన్నడ హీరోతో మూవీ చేస్తారా?’ అని టీవీ9 కన్నడ మీడియా ఛానల్ రాజమౌళిని ప్రశ్నించగా, మీరు ఏ ఛానల్ నుండి అని అడిగారు. ‘టీవీ9 కన్నడ’ అని విలేఖరి బదులివ్వగా, ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పగలను, కానీ ఇప్పుడు చెప్పను అంటూ కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు జక్కన్న.

ADVERTISEMENT

ఈ ప్రశ్నకు జవాబిస్తే… మీరు ‘ఆర్ఆర్ఆర్’ని పక్కన పెట్టి, అది హెడ్ లైన్స్ లో రాస్తారని, అప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ పక్కకి వెళ్ళిపోతుందని, ఈ సినిమా రిలీజ్ అయ్యి అంతా ముగిసిన తర్వాత మళ్ళీ చిట్ చాట్ చేసినపుడు ఖచ్చితంగా చెప్తాను, ఇప్పుడైతే కాదని రాజమౌళి ఇచ్చిన సమాధానానికి ఆడిటోరియం ఫిదా అయ్యింది.

టీవీ9పై పడ్డ ఈ పంచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో టీవీ9 పై నెటిజన్లలో ఇంత వ్యతిరేకత ఉందా? అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. బహుశా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న అధికార పక్షాలను తన భుజస్కంధాలపై టీవీ9 వేసుకోవడం ఇందుకు ఓ కారణం కావచ్చు.

అలాగే గతంలో పవన్ – శ్రీరెడ్డి ఎపిసోడ్స్ సమయంలో టీవీ9ను బాయ్ కాట్ చేయాలంటూ పవన్ ఫ్యాన్స్ పిలుపునిచ్చిన ప్రభావం కావచ్చు. రాజమౌళి కూడా ప్రత్యేకంగా ఏ మీడియా అని అడిగి మరీ బదులివ్వడంలో ఆంతర్యం ఏమిటి? టీవీ9పై జక్కన్నకు కూడా ఓ ‘స్పెషల్’ అభిప్రాయం ఉన్నట్లే కదా!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Pics: Malavika Makes Desi Glam Look Truly Regal!

Malavika Mohanan brings a striking dose of royal glamour to this pink and gold saree…

20 minutes ago

Scene Movie Leak: Suriya Repeating His Own Blockbuster?

Following the back to back commercial success of Karuppu and Vishwanath and Sons, Suriya is…

41 minutes ago