
ఈ సందర్భంగా అల్లు అర్జున్ కు పలు సూచనలు కూడా చేసారు. ముంబైలో “పుష్ప”ను బాగా ప్రమోట్ చేయమని, ఇంత మంచి ప్రోడక్ట్ మరియు అక్కడ ఉన్న బజ్ కు సినిమాను ఇంకా బాగా ప్రమోట్ చేయాలని, ముఖ్యంగా ఈ విషయం బన్నీకి చెప్తున్నానని సూచనలు, సలహాలు ఇచ్చారు రాజమౌళి.
ఈ సినిమా టీజర్ చూసినపుడు చాలా బాగా నచ్చేసిందని, విజువల్స్ చాలా బాగున్నాయని, తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లే విధంగా విజువల్స్ ఉన్నాయని కొనియాడారు. అలాగే బన్నీ డెడికేషన్ కు తాను హ్యాట్సాఫ్ చెప్తున్నానని, మరెంతో మందికో స్ఫూర్తిగా నిలవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు జక్కన్న.
ఈ వేడుకలో తన అభిమాన దర్శకుడు సుక్కు లేనందుకు బాధగా ఉన్నా, ముంబైలో ఉంటూ “పుష్ప” కోసం అహర్నిశలు కష్టపడుతున్నాడని, సమయం సరిపోవడం లేదని చెప్పిన సుక్కుకు, సినిమా బాగా రావడానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు చేయమని చెప్పినట్లుగా రాజమౌళి ఈ సందర్భంగా అన్నారు.
‘పుష్ప’ ప్రమోషన్ విషయంలో అల్లు అర్జున్ కు రాజమౌళి ఇచ్చిన సలహా 100% అమలు పరిచి తీరాలి. ఇప్పటికే ఉత్తరాదిన ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తి చేయాల్సి ఉండగా, అది ఏ మాత్రం కార్యరూపం దాల్చకపోవడంతో, టాప్ డైరెక్టర్ గా ఓ మంచి సలహానే ఇచ్చారు.
అంతా బాగా చెప్పిన రాజమౌళి “పుష్ప” ట్రైలర్ అంశం మాత్రం ప్రస్తావించలేదు. ఇంతకీ జక్కన్నకు ట్రైలర్ నచ్చలేదా? లేక ‘ఆర్ఆర్ఆర్’ హడావుడిలో ఉన్న రాజమౌళికి “పుష్ప” ట్రైలర్ రిలీజ్ అయ్యిందన్న విషయం తెలియలేదా?
The pre-release event of Ramayana was held in Hyderabad, where a large crowd gathered for…
Nani and OG director Sujeeth have teamed up for Bloody Romeo, a stylish action film…