Telugu

జక్కన్న ఓపెన్ అయితే ఇండస్ట్రీ షేక్?

ప్రస్తుతం “బాహుబలి 2” సక్సెస్ తో ఎనకీర్తి ప్రతిష్టతలను సొంతం చేసుకున్న దర్శకుడు రాజమౌళి, గతంలో తెరకెక్కించిన “మగధీర” సినిమా విషయంలో నిర్మాత అల్లు అరవింద్ తో విభేదాలు వచ్చిన విషయం ఇండస్ట్రీ వర్గాలలో బాగా ప్రచారం జరిగింది. గతంలో ఇచ్చిన పలు ఇంటర్వ్యూలలో దీనిపై రాజమౌళి పరోక్షంగా సంకేతాలు ఇచ్చినప్పటికీ, అసలు ‘మగధీర’ విషయంలో వాస్తవంగా ఏం జరిగింది అన్నది ఎప్పుడు ఓపెన్ అవ్వలేదు. అయితే తాజాగా ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ‘ఓపెన్’ ఇంటర్వ్యూలో దీనికి సంబంధించి పూర్తి స్పష్టత ఇచ్చినట్లుగా కనపడుతోంది.

ADVERTISEMENT

దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎందుకంటే… ‘మగధీర’ విషయంలో అల్లు అరవింద్ తో విభేదాలు ఉన్న మాట వాస్తవమే అన్న ముక్క ఈ ప్రోమోలో ఉండడంతో, నాడు జరిగిన అసలు విషయం ఏంటన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. “అల్లు అరవింద్ పై కోపాలు ఉన్న మాట నిజమే, అలాగే వంద రోజుల వేడుకకు నేను రాలేను సార్” అంటూ జక్కన్న చెప్పిన రెండు ముక్కలతో ఈ ప్రోమో వైరల్ అవుతోంది. మరి నిజంగా జరిగిన గుట్టు విప్పితే, మెగా కాంపౌండ్ వేదికగా ఇండస్ట్రీ షేక్ కావడం ఖాయమా?

ట్రేడ్ వర్గాలలో హల్చల్ చేస్తున్న సమాచారం మేరకు… ‘మగధీర’ సక్సెస్ క్రెడిట్ ను రెండవ సినిమా చేస్తున్న రామ్ చరణ్ కీర్తిస్తూ… మెగా కాంపౌండ్ లో వేసే విధంగా అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు చేయడంతో, దానికి జక్కన్న నొచ్చుకోవడంతో అభిప్రాయబేధాలు వచ్చాయన్న టాక్ ఉంది. ఈ కారణంతోనే మరోసారి గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తాను సినిమా చేయబోనని రాజమౌళి బహిరంగంగా చెప్పారని అప్పట్లో హల్చల్ చేసిన టాక్. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలంటే ఆదివారం ప్రసారం కాబోయే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Romanchakam Review: U.S. Premiere Report

Romanchakam is produced by Bhadrakali Pictures, the banner of Sandeep Vanga and Pranay Vanga, who…

2 hours ago

Ravi Teja Gave More Confidence To Jr NTR?

Ravi Teja made a comeback of epic proportion with his latest film Irumudi. This devotional…

6 hours ago