
ఇది స్వయంగా రాజమౌళినే ‘జ్యో అచ్యుతానంద’ ఆడియో వేడుక నుండి చెప్పారు. ట్రైలర్ చూసాను… చాలా బాగుంది… అనడం కంటే పక్కా హిట్టు సినిమాను దర్శకుడు శ్రీనివాస్ అవసరాల అందించాడని చెప్పవచ్చు… ట్రైలర్లో ఒక సస్పెన్స్ ఉంది… నాగశౌర్య, నారా రోహిత్ లలో ఎవరు హీరోయిన్ ను ప్రేమించారు… హీరోయిన్ రెజీనా ఎవరిని ప్రేమించింది… అన్నది ఆసక్తికరంగా ఉంది… రెజీనా ఎక్స్ ప్రెషన్స్, శౌర్య, రోహిత్ లు బ్రదర్స్ గా బాగా నటించారంటూ కితాబిచ్చిన రాజమౌళి, ఈ ట్రైలర్ ఇంత బాగా రావడానికి కారణం మాత్రం తన సోదరుడేనని చెప్పారు.
మీరేమైనా అనుకోండి… స్వార్ధం అనుకోండి… ఏమనుకోండి… ఈ ట్రైలర్ లో ఎక్కువ మార్కులు సంగీత దర్శకుడు కళ్యాణ్ రమణకు ఇస్తానని, చాలా బ్రహ్మాండంగా సంగీతం అందించాడని, హృదయానికి హత్తుకునేలా ట్రైలర్ ఉంది అంటే… మీరు ఎంత బాగా నటించినా… వాళ్ళు ఎంత బాగా తీసినా… రమణ అందించిన సంగీతమే ఫస్ట్ ప్లేస్ లో ఉంది అనుకుంటున్నాను… రాబోయే రెండు, మూడు నెలల పాటు తన కారులో ఈ సినిమాలోని పాటలే ఉంటాయని చెప్పడంలో సందేహం లేదు… అంటూ నవ్వులతో కూడిన తన స్వార్ధమైన ప్రేమను తన సోదరుడిపై చూపించారు రాజమౌళి.
The motion poster of Chandrayan has been unveiled, giving audiences a glimpse into a wildly…
Chennai Super Kings have been asked to consider a change in captaincy before IPL 2027,…