
బాహుబలి తరువాత ఆ స్థాయిలో పార్ట్ 2 కోసం పాన్ ఇండియా మొత్తం ఆసక్తిగా ఎదురుచూసిన టాలీవుడ్ మూవీ పుష్ప అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదనే చెప్పాలి. ఈ కాలు నాది ఈ కాలు నాదే…నా కాలు మీద నా కాలేసుకుంటే, అంటూ పుష్ప లో అల్లు అర్జున్ చెప్పిన మాస్ డైలాగ్ ఇప్పుడు పుష్ప 2 రికార్డుల విషయంలో సరిగ్గా సరిపోయేలా ఉంది.
ఆ రికార్డులు నావే…ఈ రికార్డులు నావే అన్నట్టుగా పుష్ప -2 ట్రైలర్ విడుదలతో పుష్ప -1 కు వచ్చిన రికార్డ్స్ అన్ని తుడుచుపెట్టుకుని పోయేలా ఉన్నాయి. ట్రైలర్ విడుదలైన 15 గంటల సమయంలోనే 40 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్ సాధించి సౌత్ ఇండియాలో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన తొలి చిత్ర ట్రైలర్ గా యూ ట్యూబ్ లో కొత్త రికార్డులను నమోదు చేసుకుంది పుష్ప- 2.
నిన్న పట్నాలో మొదలైన ఈ పుష్ప గాడి మాస్ ఫైర్ డిసెంబర్ 5 నా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించనుంది. ఎర్ర చందనం దొంగగా ప్రేక్షకులకు పరిచయమైనా పుష్ప ఇప్పుడు సగటు సినీ ప్రేక్షకుడి మనసు దోచాడు. పట్నాలో జరిగిన పుష్ప ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి ప్రేక్షకుల నుంచి వచ్చిన అనూహ్య స్పందన చూస్తే ఈ సినిమా మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇట్టే అర్ధమవుతుంది.
అయితే ఈ పుష్ప గాడి రచ్చ మీద స్పందించిన దర్శక ధీరుడు జక్కన్న తన సోషల్ మీడియాలో పుష్ప టీం కు అభినందనలు తెలియ చేస్తూ “పట్నాలో WILDFIRE మొదలైంది. దేశమంతా విస్తరిస్తుంది. డిసెంబర్ 5 న పేలనుంది. పార్టీ కోసం ఎదురుచూస్తుంటా పుష్ప…అంటూ పుష్ప ట్రైలర్ కు వచ్చిన భారీ స్పందనను తన ట్వీట్ తో వ్యక్తపరిచారు రాజమౌళి.
ప్రేక్షకులలో ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ తోనే సినిమా విజయాన్ని దాదాపు ఖరారు చేసేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఒక ట్రైలర్ అన్ని భాషలలోను పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం అంటే అది సినిమా విజయాన్ని నిర్దారించినట్టే అవుతుంది.
బాహుబలి -2 , కెజిఎఫ్ -2 సినిమాలు కూడా ఈ స్థాయి అంచనాలతోనే థియేటర్లలోకి వచ్చి బాక్స్ ఆఫీస్ రికార్డులను తన పేరిట మార్చుకున్నాయి. ఇప్పుడు ఆ రికార్డుల వేటలో పుష్ప గాడి వంతు వచ్చింది అంతే అంటున్నారు బన్నీ ఫాన్స్.
A Reddit post has gone viral for claiming that the cybersecurity firm Fortinet has laid…
An Indian F-1 student finds herself in serious trouble. A misunderstanding at Walmart has left…