
సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ప్రమోషన్ల ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు సినిమా విడుదలకు ముందు ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో ప్రచారం ముగిసేది. కానీ ఇప్పుడు షూటింగ్ ప్రారంభం నుంచి విడుదల వరకు ప్రతి అప్‌డేట్‌ను ప్రమోషన్‌లో భాగం చేస్తున్నారు.
ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు దర్శకనిర్మాతలు కొత్త కొత్త ఆలోచనలతో ముందుకొస్తున్నారు. ముఖ్యంగా దర్శకధీరుడు రాజమౌళి ప్రమోషన్లలో తనదైన ముద్ర వేస్తున్నారు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాల ప్రచారాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లి తెలుగు సినిమా మార్కెట్‌ను విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. భారీ ఈవెంట్లు, వినూత్న ప్రచార కార్యక్రమాలతో సినిమా విడుదలకు ముందే అంచనాలను పెంచడంలో ఆయన ప్రత్యేకత చూపిస్తున్నారు.
ఇక అనిల్ రావిపూడి ప్రమోషన్ల శైలి మరోలా ఉంటుంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కోసం వెంకటేష్‌తో కలిసి చేసిన ఫన్నీ ఇంటర్వ్యూలు, రీల్స్, సోషల్ మీడియా వీడియోలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే గత సంక్రాంతికి వచ్చిన చిరు మన శంకర వరప్రసాద్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మూవీ ప్రమోషన్స్ కు దూరంగా ఉండే నటి నయనతారతో ఒక ప్రమోషనల్ వీడియో చేసి సినీ ఇండస్ట్రీ పెద్దలను సైతం ఆశ్చర్యపరిచారు.
సినిమా కథలోని వినోదాన్ని ప్రమోషన్లలోనూ చూపిస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచారు. అలాగే ఇప్పుడు తన తాజా చిత్రం ‘జనవరి 12 న విడుదల’ చిత్రానికి సైతం అదే ఫార్మాట్ లో ముందుకెళ్తున్నారు అనిల్. ఇలా రాజమౌళి సినీ ప్రమోషన్స్ బాహుబలి మాదిరి భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఉంటె అనిల్ మూవీ ప్రమోషన్స్ మాత్రం ప్రాంతీయ చిత్రాలకు సరితూగే విధంగా తనదైన కామెడీ, వినోదాత్మక శైలిలో సాగుతున్నాయి.
అయితే ప్రమోషన్లు ఎంత భారీగా చేసినా సినిమా విజయానికి అవే హామీ ఇవ్వలేవు. ప్రచారం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించవచ్చు. కానీ సినిమా నచ్చితేనే వారు ఇతరులకు సిఫార్సు చేస్తారు. భారీ అంచనాలతో వచ్చి నిరాశపరిచిన సినిమాలు ఒకవైపు ఉంటే, పెద్దగా ప్రచారం లేకుండానే మౌత్ టాక్‌తో విజయాలు సాధించిన సినిమాలు మరోవైపు ఉన్నాయి.
ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావంతో వ్యూస్, లైక్స్, ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్‌లు సినిమాకు హైప్ తీసుకొస్తున్నాయి, ఫస్ట్ డే ఓపెనింగ్ కలెక్షన్స్ కి దోహదపడుతున్నాయి. కానీ అవన్నీ లాంగ్ రన్ లో టికెట్ల అమ్మకాలుగా మారతాయని చెప్పలేం. ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించడం ప్రమోషన్ల పని అయితే, అతడిని మెప్పించడం సినిమా కంటెంట్ బాధ్యత అవుతుంది.
అనంతపురం జిల్లాలో దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘కియా’ ఏటా 4.3 లక్షల కార్లు తయారు…
Telugu cinema is currently going through its worst spell for comedy. There was a time…