
సినీ జంటలు గొడవలు పడితే ముందుగా సోషల్ మీడియాతో ఫోటోలు డిలీట్ చేయడంతో మొదలు పెట్టి పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకొని, రెడీగా ఉన్న స్టెఫీనీతో రెండో పెళ్ళి చేసుకుంటారు.
అదే.. మధ్యతరగతి భార్యాభార్తలైతే గొడవలు పడుతూ ఆత్మహత్యల వరకు వెళుతుంటారు. కొందరు తమతో పాటు అభం శుభం తెలీని చిన్న పిల్లలను కూడా పైలోకాలకు తీసుకుపోతుంటారు.
కానీ భార్య ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తే ఏ భర్త ఆమెకి ఎలా ఉరేసుకోవాలో చెప్పి ఉండడు. ఒకవేళ చెప్పినా ఆమె ఆత్మహత్య చేసుకుంటుంటే మొబైల్ ఫోన్‌తో వీడియో షూట్ చేయడు.
కానీ కడప జిల్లా రాజంపేటలో శ్రీనివాసులు అనే వ్యక్తి భార్య ఆత్మహత్య చేసుకోవడానికి సాయపడ్డాడు. ఆ వీడియో చిత్రీకరించాడు కూడా.
అతనికి ఆమె రెండో భార్య. మొదటి భార్య, సంతానం వేరే చోట ఉంటున్నట్లు సమాచారం. ఈ కారణంగా వారి మద్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. నిన్న ఉదయం మరోసారి వారిరువురి మద్య గొడవ జరిగింది.
ఉరేసుకొని చచ్చిపోతానని ఆమె బెదిరిస్తే శ్రీనివాసులు వారించకపోగా ఎలా ఉరేసుకోవాలో భార్యకు వివరించాడు. దాంతో ఆమె భర్త చెప్పినట్లుగానే మంచంపై కుర్చీ వేసుకొని ఎక్కి ఫ్యానుకు చీర బిగించి దానిని మెడకు బిగించుకొని క్రిందకు దిగింది. అప్పుడు అతను ‘అలాకాదంటూ..’ ఏదో సలహా ఇస్తున్నట్లు ఆ వీడియోలో రికార్డ్ అయ్యింది.
ఆమె ఆవేశం మెడకు ఉరి బిగించుకొన్నప్పటికీ చనిపోవాలనుకోలేదు. కనుక మెడకు చుట్టుకున్న చీర బిగుసుకోకుండా ఓ చేత్తో పట్టుకొని మంచం మీద నిలబడింది. కానీ కాలు స్లిప్ అవడంతో ఆ చీర బిగుసుకుపోయి ఊపిరాడక చనిపోయింది. ఆమె విలవిల కొట్టుకుంటూ చనిపోతుంటే అతను నవ్వుతూ ఏదో మాట్లాడుతూ వీడియో చిత్రీకరించాడు. అతని మాటలు, నవ్వు కూడా ఆ వీడియోలో రికార్డ్ అయ్యాయి.
రాజంపేట పోలీసులు ఆ వీడియో ఆధారంగానే అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అతను రైల్వే లోకోపైలట్‌గా పని చేస్తున్నాడు.
For the first time in Bigg Boss history, there is a double eviction in the…
Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…