
వివరాల్లోకి వెళ్తే… సామజవరగమన ఉత్తరాంధ్ర ఏరియాలో పంపిణీ చేశారు సతీష్. సినిమాకు సంబంధించిన స్టేట్మెంట్ ఇవ్వలేదని, అలాగే డబ్బులు సెటిల్ చెయ్యలేదని రాజేష్ ఆరోపణ. ఇందు కోసం ఇప్పటికే స్థానిక అసోసియేషన్ ని ఆశ్రయించగా అక్కడ న్యాయం జరగకపోవడం తో ఇప్పుడు కౌన్సిల్ ని ఆశ్రయించారు రాజేష్.
తనకు న్యాయం చెయ్యమని రాజేష్ కౌన్సిల్ పెద్దలను రిక్వెస్ట్ చేశారు.
వైజాగ్ అసోసియేషన్ లో సతీష్ ఆ సినిమా హక్కులు తనకు అనిల్ సుంకర మహాసముద్రం అనే సినిమా నష్టాన్ని పూడ్చుకోమని ఇచ్చారని చెప్పారట. అయితే సినిమా నిర్మాతను నేను అని, క్యూబ్ అప్రూవల్స్ మీద, అన్ని అధికారిక పత్రాల మీద తన సంతకాలు ఉన్నాయని, ఇందులో అనిల్ గారు ఇవ్వడం ఏంటి అని రాజేష్ వాదన.
అనిల్ గారు ఆ రకంగా ఇచ్చినట్టుగా పత్రాలు కౌన్సిల్ కి సబ్మిట్ చెయ్యాలని రాజేష్ డిమాండ్ చేస్తున్నారు.
అయితే సతీష్ అసలు ఈ సినిమా కు అసలు హక్కుదారు తాను కాదని, కేవలం 5% కమిషన్ కు రిలీజ్ చేస్తున్నా అని స్థానిక ఎక్సిబిటర్ల దగ్గర డబ్బులు వసూలు చేసుకున్నారని స్థానికంగా వినిపిస్తున్న వాదన.
అనిల్ సుంకర కు సతీష్ కు ‘ఏజెంట్’ విషయంలో ఇష్యూ ఉన్న సంగతి తెలిసిందే. ఆ విషయం కోర్టు వరకు వెళ్ళింది. ఫోర్జరీ డాక్యూమెంట్స్ తో సతీష్ కోర్టుకు వెళ్లాడని సుంకర ఆరోపణ. సామజవరగమన సినిమాకు సుంకర ప్రెసెంటర్ గా ఉన్నా నిర్మాత రాజేషే.
సతీష్ ఒక సారి సామజవరగమన ఉత్తరాంధ్ర హక్కులు ఏజెంట్ లాస్ కవర్ చేసుకోవడానికి ఇచ్చారని, ఇంకో సారి మహాసముద్రం నష్టాలకు అని చెప్పడం ఇక్కడ కొసమెరుపు.
ఇప్పుడు రాజేష్ ఏకంగా సామజవరగమన నాకే రావాలి అంటూ కౌన్సిల్ కు వెళ్లడం గమనార్హం. అవసరమైతే ఎక్కడివరకు వెళ్ళడానికైనా ఆలోచించను అంటున్నారు. ఇప్పుడు సతీష్ కి ఇది కొత్త తలపోటు అనే అనుకోవాలి.
Rohith is one of the potential Bigg Boss Telugu contestants who could win the title.…
Right from the first show of Rajinikanth's anticipated sequel Jailer 2, social media has been…