
[m9ad]
ఇక మొత్తంగా చూసుకుంటే నిన్న సాయంత్రానికి ఏకంగా 2 మిలియన్ టిక్సెట్స్ బుక్ మై షో ద్వారా బుక్ అయ్యాయి అంటే…అదీ రజని క్రేజ్. అయితే 550 కోట్ల భారీ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంత వసూళ్లు సాధిస్తుందో ట్రేడ్ వర్గాలు ఇంకా అంచనా అయితే వెయ్యలేకపోతున్నారు కానీ, ఈ హడావిడి, ఈ హంగామా చూస్తూ ఉంటే మాత్రం ఈ చిత్రం అడ్వ్యాన్స్డ్ బుకింగ్స్ ద్వారానే పదుల కోట్లలో వసూళ్లు రాబడుతుంది అని చెప్పవచ్చు. ఇక బుక్ మై షో మాత్రమే కాకుండా ఇతర వెబ్సైట్స్ ద్వారా బుకింగ్ చేసుకునే వాళ్ళు, మరో పక్క డైరెక్ట్ గా క్యూలో నిలబడి టికెట్ తీసుకునే వాళ్ళు, అసలు ఆన్లైన్ లో లేని థియేటర్స్ ఇలా చాలా కధే ఉంది.
మొత్తంగా చూసుకుంటే మాత్రం రజని బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర మొదలు పెట్టాడు అని ఉదయం నుంచి వస్తున్న రివ్యూస్ స్పష్టం చేస్తున్నాయి. ఇక రేపటి సాయంత్రం నుంచి వీకెండ్ ఫీవర్ మొదలు కానుండడంతో ఈ వెబ్సైట్స్ ట్ర్యాఫిక్ మరింత పెరిగి…హ్యాంగ్ అయినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. మొత్తంగా మాత్రం తలైవార్ ఎక్కడా తగ్గట్లేదు అని స్పష్టంగా చెప్పవచ్చు.
Two distinct character introductions are offering audiences an early look at the world being created…
The Supreme Court’s latest decision on Andhra Pradesh municipal elections has cleared the way for…