
ఈ నేపథ్యంలో ఓ ధియేటర్ యజమాని, సినిమా పంపిణీ దారుడు వాట్సప్ మాధ్యమంగా చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్ లో పెను కలకలం రేపుతున్నాయి. మధురైలో నాకో సొంత థియేటర్ ఉంది. అందులో ‘కబాలి’ 217 రోజులు ప్రదర్శిత మైంది. ఈ రోజు కూడా ‘కబాలి’ మార్నింగ్ షో 47 టిక్కెట్లు అమ్ముడుపోయాయి. రెగ్యులర్ గా జనం వస్తున్నారు. ‘కబాలి’ సినిమాపై ఇతర పంపిణీదారులు చేసిన ఆరోపణలు ఎస్.థాను, రజనీ సార్ లను అవమానించేలా వున్నాయి.
ఒక పంపిణీదారుడిగా, థియేటర్ యజమానిగా చెబుతున్నా ప్రతి వ్యాపారంలో లాభనష్టాలు సహజం. అలా అని ఇలా ప్రత్యేకంగా కొంతమంది పేర్లు చెప్పి దుష్ప్రచారం చేయడం తగదు. ‘కబాలి’ సినిమా మధురై ఏరియాలో లాభాలు తెచ్చిపెట్టింది” అని తెలిపారు. దీంతో ఈ వాట్సప్ ప్రకటన కోలీవుడ్ లోని పంపిణీదారుల్లో కలకలం రేపుతోంది.
Dhanush is currently one of the busiest actors in Kollywood with multiple projects in his…
Rinku Singh has once again missed out on India’s T20I squad, and former India batter…