Telugu

సూపర్ స్టార్ ‘లుంగీ’ మడతేసాడుగా!

స్టైల్ స్టైల్ రా… నీది సూపర్ స్టైల్ రా… అంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ స్టైల్ ను ప్రశంసిస్తూ ‘భాషా’ సినిమాలో హీరోయిన్ నగ్మా పాట పాడుతూ ఉంటుంది. ఈ పాట ఒక్క రజనీకి తప్ప మరో హీరోకు సూట్ కాదనే విధంగా… తన స్టైల్స్ తో ప్రేక్షకులను మెప్పిస్తుంటారు. నిజానికి రజనీకి క్రేజ్ తీసుకువచ్చిందే ఈ స్టైల్స్ వలన. ఇతర కధానాయకుల నుండి రజనీని ఈ స్టైల్స్ వేరు చేసాయి.

సినిమాకొక మేనరిజంతో అభిమానులను కట్టిపడేసే రజనీ, తాజాగా తెరకెక్కుతోన్న “కాలా” సినిమాలో కూడా ఓ స్టైల్ ను అనుసరిస్తున్నట్లుగా కనపడుతోంది. ఈ సినిమా ఆద్యంతం రజనీ లుంగీలో దర్శనమివ్వనున్నారని, ఇటీవల విడుదలైన వర్కింగ్ స్టిల్స్ చెప్పకనే చెప్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఓ ఫోటో తాజాగా కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ADVERTISEMENT

లుంగీ పైకి మడతేసి చేత్తో పట్టుకున్న రజనీ స్టిల్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా ఈ స్టిల్స్ తో “భాషా” సినిమా నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. రజనీ కెరీర్ లోనే కాదు, దక్షిణాది చిత్ర సీమలోనే “భాషా” సినిమా ఒక సెన్సేషన్. అలాంటి సినిమాను గుర్తుకు తెస్తున్న “కాలా” ఏ రేంజ్ లో ఉంటుందో గానీ, వర్కింగ్ స్టిల్స్ తో అయితే అభిమానులను చంపేస్తున్నారు ‘సూపర్ స్టార్.’

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Mokshagna’s Heroine Hunt: Why Srikanth’s Daughter Quit?

Medha Meka, daughter of Srikanth and Ooha, was initially considered for the female lead role…

16 minutes ago

OTT Effect: Vijay’s Son Jason Sanjay Gets Slammed Again

Tamil Nadu Chief Minister Vijay's son Jason Sanjay's debut directorial film Sigma starring Sundeep Kishan…

46 minutes ago