
[m9ad]
తమిళ తంబీల నుంచి వినిపిస్తున్న కధనం ప్రకారం తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ మురుగుదాస్ తో ఒక సినిమా చేయనున్నాడు అని తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో రజనీ తన సినిమా కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి, ఆ తర్వాత ఫుల్ టైం పాలిటిక్స్ లోకి వెళ్లిపోవడమే ఆలోచన తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం టీం ని సెట్ చేస్తున్న మురుగుదాస్ కి కెమెరా మాన్ గా సంతోష్ శివన్ అయితే బావుంటుంది అని అనిపించిందట. అయితే సంతోష్ ఇప్పటికే మురుగుదాస్ తో తుపాకీ, స్పీవైడర్ చేసి ఉన్నాడు. అయితే తలైవార్ తో కూడా ఒక సినిమా చేసాడు అదే “దళపతి”. అదే 1991 లో వచ్చిన దళపతి. మళ్ళీ ఆ సినిమా తర్వాత ఇదిగో రజనీతో ఈ సినిమా చేస్తున్నాడు సంతోష్ శివన్.
అయితే ఈ సినిమా పూర్తి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతూ ఉండగా ఈ సినిమాని లైకా సంస్థ నిర్మించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక సంక్రాతి బరిలో నిలవనున్న పెట్టా సినిమా తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా పొలిటికల్ ఎంట్రీ ముందే వరుసగా సినిమాలు చేసేస్తున్నాడు మన తలైవార్. మరి చూద్దాం ఈ చివరి సినిమాలు ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో.
The Supreme Court’s hearing on the Andhra Pradesh municipal elections could change the fate of…
Chiranjeevi is reportedly preparing to enter a new space with his talk show MEGAVerse for…