
జయలలిత మృతి తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై రజనీకాంత్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని భర్తీ చేయడం ఒక్క రజనీ వల్లే సాధ్యమవుతుందని అభిప్రాయ పడుతున్నారు. పన్నీర్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి చాకచక్యంగా తప్పించిన శశికళ సీఎం పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమైన నేపథ్యంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిమానులు పిలుపునిస్తున్నారు. అంతేకాదు, రజనీ రాజకీయాల్లోకి రావాలంటూ పెద్ద ఎత్తున సందేశాలు సైతం పంపుతున్నారు.
తన రాజకీయ రంగ ప్రవేశంపై వెల్లువలా వచ్చిపడుతున్న సందేశాలు, విస్తృతంగా ప్రచారమవుతున్న ఊహాగానాలతో ఉక్కిరిబిక్కిరి అయిన రజనీకాంత్ స్పందించక తప్పలేదు. తను పేర్కొన్న ‘పవర్’ ఆధ్యాత్మికతకు సంబంధించినదంటూ వివరణ ఇచ్చారు. ఆధ్యాత్మిక దృష్టితో ఆ మాటను అన్నాను తప్పితే, రాజకీయ ఉద్దేశంతో కాదని, డబ్బు, కీర్తి… ఈ రెండింటిలో ఏది కావాలని అడిగితే తను ఆధ్యాత్మికతనే ఎంచుకుంటానని తేల్చిచెప్పారు. దానికే అంత శక్తి (పవర్) ఉంటుందని పేర్కొన్నారు. తాను ఆ ఉద్దేశంతోనే అన్నాను తప్పితే రాజకీయ కోణంలో కాదని, తన మాటలను మరోలా తీసుకోవద్దని అభిమానులను కూడా కోరారు.
Raaka is already shaping up to be one of the most ambitious films of Allu…
Dhanush is currently one of the busiest actors in Kollywood with multiple projects in his…