
ఈ ఆరుగురిలో ఒక్క సీఎం రమేష్ కు తప్ప ఎవరికీ తిరిగి నామినెటే అయ్యే అవకాశం దాదాపుగా లేనట్టే. సంఖ్యాబలం బట్టి తెలుగు దేశం పార్టీకి రెండు, వైకాపాకు ఒక సీటు రావాల్సి ఉంది. అయితే ఆంధ్రాలో ఉన్న పరిస్థితుల బట్టి ఈ ఎన్నిక రసవత్తరంగా జరగబోతుంది. వైకాపా నుండి చాలా మంది ఎమ్మెల్యేలు టీడీపీలో జాయిన్ కావడంతో మరో 2-3 ఎమ్మెల్యేలను లాక్కోగలిగితే టీడీపీ ఈ సీటును కైవసం చేసుకోవచ్చు.
అయితే వైకాపా టీడీపీలో జాయిన్ అయినా కొంత మందిని తిరిగి వెనక్కు తెచ్చే ప్రయత్నం చేస్తుంది. టీడీపీ బీజేపీ మధ్య పెరిగిన అగాధం వల్ల ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు ఎలా వ్యవహరించబోతున్నారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. మూడు సీట్లు కైవసం చేసుకోగలిగితే గనుక టీడీపీ నైతికంగా విజయం సాధించినట్టే.
After a long wait, Mirzapur The Movie is arriving on the big screen on September…
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…