తడిసి ముద్దయ్యిందట… ఫోటో కూడా పోస్ట్ చేసింది..!

Rakul Preet Singh Launches Big C Mobile shop in kurnoolప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా మారిన రకుల్ ప్రీత్ సింగ్ అభిమాన వర్షంలో తడిసి ముద్దయ్యానంటోంది. క్రేజీ ప్రాజెక్టులతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా టాలీవుడ్ లో నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ శనివారం నాడు కర్నూలులో సందడి చేసింది. బిగ్ సి బ్రాండ్ అంబాసిడర్ గా పని చేస్తున్న రకుల్… కర్నూలులో సదరు సంస్థ ఏర్పాటు చేసిన అవుట్ లెట్ ఓపెనింగ్ కు వెళ్లింది.

ADVERTISEMENT

బిగ్ సి షాప్ ఓపెనింగ్ కు రకుల్ వస్తుందన్న విషయం తెలుసుకున్న అభిమానగణం పోటెత్తారు. ఇంత జన ప్రవాహాన్ని చూసి ముగ్దురాలైన రకుల్, అభిమానులతో కూడిన ఓ సెల్ఫీని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. “కర్నూలు వాసుల అభిమాన వర్షంలో తడిసి ముద్దయ్యానని, 4,151వ షోరూం ఓపెన్ చేసిన బిగ్ సి కి శుభాకాంక్షలని, తనకు ఇంత మంచి అనుభూతిని పంచినందుకు ధన్యవాదాలు” తెలిపింది ఈ ముద్దుగుమ్మ.

ADVERTISEMENT
Latest Stories